Begin typing your search above and press return to search.
చప్పగా ఉందేంటి గురు!!
By: Tupaki Desk | 25 Sep 2018 5:25 AM GMTఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాకు హైప్ రావాలన్నా భారీగా ఓపెనింగ్స్ తెచ్చుకోవాలన్న టీజర్ ట్రైలర్లతో పాటు ఆడియో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తోంది. గీత గోవిందం విజయంలో ఇంకేం కావాలె పాటను ఇందుకు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మిగిలిన పాటలు కూడా బాగున్నప్పటికీ దాని ప్రభావం యూత్ ని అలా నెలల పాటు వెంటాడుతూనే ఉంది. అందుకే దర్శక నిర్మాతలు మ్యూజిక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉంటారు.
నిన్న రామ్ హీరోగా రూపొందుతున్న హలో గురు ప్రేమ కోసమే ఫస్ట్ ఆడియో సింగల్ విడుదల చేసారు. ఈ ఏడాది మంచి ఫామ్ లో ఉన్న రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు కావడంతో దీని మీద మ్యూజిక్ లవర్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు. మై వరల్డ్ ఈజ్ ఫ్లయింగ్ అంటే నా ప్రపంచం గాల్లో ఎగురుతోంది అని అర్థం వచ్చేలా ట్యూన్ చేసిన ఈ ట్రాక్ ఏమంత చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
నిజానికి దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్స్ విషయంలో కొంత రిపిటీషన్ ఉంటుందని అనే కామెంట్ ముందు నుంచి ఉన్నప్పటికీ ఫైనల్ గా క్యాచీ నెంబర్స్ తో అందరిని ఆకట్టుకోవడం అలవాటే. ట్రెండ్ కు భిన్నంగా రంగస్థలం లాంటి టిపికల్ సబ్జెక్ట్ కి అతను ఇచ్చిన మ్యూజిక్ టాప్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. రంగమ్మ మంగమ్మ ఏకంగా వంద మిలియన్ల వ్యూస్ మార్కును కూడా చేరుకుంది. ఆ తర్వాత భరత్ అనే నేనుకి ఈ స్థాయిలో కాకపోయినా టైటిల్ ట్రాక్ ప్లస్ వచ్చాడయ్యో సామీ జనానికి బాగా ఎక్కేశాయి.
అలాంటప్పుడు హలో గురు ప్రేమ కోసమే మీద అంచనాలు పెట్టుకోవడం తప్పేమి కాదు. కానీ ఇది మాత్రం సాధారణంగా అనిపించడం ముమ్మాటికీ మైనస్ అనే చెప్పాలి. మిగిలిన పాటల్లో ఏదైనా మేజిక్ ఉందేమో వచ్చాకే చెప్పగలం. ఇదే దర్శకుడు త్రినాథ రావుతో దేవి చేసిన నేను లోకల్ ఆడియో పరంగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. మరి మొదటి ట్రాక్ మాత్రమే ఇలా ఉండి మిగిలినవి వర్క్ అవుట్ అవుతాయేమో వెయిట్ చేసి చూడాలి. అక్టోబర్ 18న సినిమా విడుదల ప్లాన్ చేసారు కానీ ఇంకా ఖరారు కావాల్సి ఉంది.