Begin typing your search above and press return to search.

నా నెక్స్ట్ మూవీ ఈ బ్యానర్లోనే: జాతిరత్నాలు డైరెక్టర్ ఇంటర్వ్యూ

By:  Tupaki Desk   |   9 March 2021 4:49 PM GMT
నా నెక్స్ట్ మూవీ ఈ బ్యానర్లోనే: జాతిరత్నాలు డైరెక్టర్ ఇంటర్వ్యూ
X
మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మాతగా మారి నిర్మించిన సినిమా జాతిరత్నాలు. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధానపాత్రలలో నటించారు. ఈ సినిమాకు 'పిట్టగోడ' ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వం వహించాడు. మొత్తానికి ఈ సినిమా మహాశివరాత్రి సందర్బంగా మార్చ్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో డైరెక్టర్ అనుదీప్ విలేకరులతో జాతిరత్నాలు సినిమా గురించి ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి అనుదీప్ చెప్పిన విషయాలేంటో చూద్దాం!

*అసలు జాతిరత్నాలు కథ ఎలా పుట్టింది? బేస్ ప్లాట్ ఏంటి?

అంటే.. ఓ ముగ్గురు అమాయకులు అనుకోకుండా ఓ సీరియస్ క్రైమ్ లో ఇరుక్కుంటే ఎలా ఉంటుంది..? అనే దాంట్లో కథ పుట్టింది. డంబ్ అంటే పూర్తిగా చట్టాలపై అవగాహన లేని వాళ్లు పోలీసు స్టేషన్‌, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తే ఎలా స్పందిస్తారు? అనే ఆలోచనతో మొదలైంది.


*నాగ్ అశ్విన్ ఎలా మిమ్మల్ని కలవడం జరిగింది.. మీతో తీద్దాం అని?

పదేళ్ల క్రితం నేను తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ నాగ్‌ అశ్విన్‌ చూసి బాగా నచ్చడంతో నాతో సినిమా చేయాలనుకున్నారట. ‘పిట్టగోడ’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ సమయంలో నాకు మెసేజ్ పెట్టారు. నా ఫస్ట్ సినిమా ఫ్లాప్‌ అయినా నాకు ఇంతటి అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది.

*క్యారెక్టర్స్ సెలక్షన్ ఎలా జరిగింది?

వాస్తవానికి నవీన్‌ పొలిశెట్టిని నాగ్‌ అశ్విన్‌ సెలెక్ట్ చేశారు. అయితే ఇప్పటికే రాహుల్‌, ప్రియదర్శి కాంబినేషన్ లో కొన్ని సినిమాలు వచ్చాయి. మళ్లీ ఇదే కాంబినేషన్‌లో చేయడం కంటే కొత్తగా ప్రయత్నిద్దాం అనుకుని ఆడిషన్‌ చేశాం. కానీ, కుదరలేదు దాంతో వీళ్లనే తీసుకున్నాం.

*చూస్తుంటే ఈ ముగ్గురితో కామెడీ బాగా చేయించినట్లున్నారు?

నిజానికి సినిమాలో వీళ్ల క్యారెక్టర్స్ సీరియస్‌గానే ఉంటాయి. కాకపోతే చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం కామెడీ అనిపిస్తుంది.

*ఇందులో పాత్రలకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంది?

మెయిన్ క్యారెక్టర్స్ నాలుగు మాత్రమే కాదు. వేరే అన్ని పాత్రలకూ ఈ సినిమాలో ఇంపార్టెన్స్ ఉంటుంది. సినిమా చూశాక మీరే చెప్తారు.

*స్టోరీని ఎలా డెవలప్ చేశారు?

నేనూ నాగ్‌ అశ్విన్‌, సమర్‌ అని.. ముగ్గురం కలిసి ఈ కథని డెవలప్‌ చేశాం. నాగ్‌ అశ్విన్‌ అంతపెద్ద డైరెక్టర్ అయినా కూడా స్నేహంగా ఉంటారు. షూటింగ్ సమయంలో కూడా ఎలాంటి ఒత్తిడి పెట్టలేదు.

*లాక్ డౌన్ లో ఓటిటి ఆఫర్స్ వచ్చాయట కదా?

అవును. లాక్‌డౌన్‌ సమయంలో అమెజాన్ ప్రైమ్ నుంచి భారీ ఆఫర్ వచ్చినా ప్రేక్షకులకి థియేటర్‌లోనే చూపియాలనే ఇంతకాలం వెయిట్ చేసాం.

*మ్యూజిక్ గురించి చెప్పండి.. సక్సెస్ అయింది?

ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ను ఓకే చేసే ప్రాసెస్ లో చాలామందిని అనుకున్నాం. చివరకు రధన్ కథ వినగానే ఎక్జైట్ అయ్యాడు. వెంటనే నాగ్ అశ్విన్ రధన్ ను ఓకే చేశారు. ఈ కథలో మూడు పాటలకే స్కోప్‌ ఉంది. పాటలతో పాటూ బాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది.

*అసలు జడ్జి పాత్రలో బ్రహ్మానందం ఎలా చేరారు?

జడ్జిపాత్రకు సంబంధించి మొదట్లో రెండు మూడు డైలాగులు రాసుకున్నాం. అయితే ఆ క్యారెక్టర్ చేయడానికి బ్రహ్మానందం అయితే బాగుంటుందని స్వప్న చెప్పడంతో ఆయనకు తగ్గట్టు స్ర్కిప్టులో కొన్ని సన్నివేశాలు పెంచాం. ఆయన పాత్ర దాదాపు 20నిమిషాలు ఉంటుంది.

* ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?

నేను హారర్‌, హింస నేపథ్యంలో సినిమాలు తీయలేను. ఇకపై కామెడీ, డ్రామా మూవీస్ చేస్తాను. లాక్‌డౌన్‌లో కొన్ని కథలు రాసుకున్నాను. వాటిలో మార్షల్‌ ఆర్ట్స్‌తో కూడిన కామెడీ కథ ప్రస్తుతం చర్చల్లో ఉంది. అదికూడా ఇదే బ్యానర్ లో ఉండబోతుంది.