Begin typing your search above and press return to search.

నేను ఖాన్.. అయితే ఏంటంట?

By:  Tupaki Desk   |   6 Dec 2017 6:48 AM GMT
నేను ఖాన్.. అయితే ఏంటంట?
X
సెటైర్లకు రూమర్స్ కి అప్పటికప్పుడే కౌంటర్స్ గట్టిగా వేస్తే అవి మళ్లీ పుట్టడానికి భయపడాలి అనేలా కొందరు స్టార్స్ చాలా ధీటుగా విమర్శలకు కౌంటర్లు వేస్తారు. కొందరు సాధారణంగా ఎలాంటి కామెంట్స్ ను పట్టించుకోకుండా వెళతారు. మరికొందరు మాటకు మాటతో సమాధానం చెబుతూ దైర్యంగా ముందుకు సాగుతుంటారు. అదే తరహాలో ఇప్పుడు కొంతమంది ఫాలో అవుతున్నారు. వారిలో కుష్బూ కూడా ఉన్నారు

ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన కుష్బూ తనపై ఎన్ని విమర్శలు వచ్చిన ఎప్పటికప్పుడు కౌంటర్లు వేస్తూ వస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో అన్ని వివాదలపై తనదైన శైలిలో స్పందిస్తూ వస్తున్నారు. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఆమె పేరు కుష్బూ కాదని ఆమె ఒక ముస్లిమ్ అని కొందరు కామెంట్స్ చేశారు. అలాగే ఆమె పేరు నఖాత్‌ ఖాన్‌ అని కూడా చెబుతుండడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

దీంతో కుష్బూ అప్పుడే కౌంటర్ ఇచ్చేశారు. ‘ కొందరు నన్ను కొత్తగా కనిపెట్టారు. నా పేరు నఖాత్‌ ఖాన్‌.. యురేకా!! ముర్ఖులారా.. ఆ నేమ్ నా పేరెంట్స్ పెట్టారు. అవును నా పేరు ఖాన్‌.. అయితే ఏంటి? చాలా లేట్ అయ్యింది, ఇక చాలు మేలుకోండి. ఇంకా 47 ఏళ్ల కాలం వెనుకె ఉన్నారు’ అంటూ ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

ఇక కుష్బూకు చాలా మంది మద్దతు తెలిపారు. ఇక కుష్బూ చాలా రోజుల తర్వాత మళ్లీ టాలీవుడ్ లో ఒక సినిమాను చేశారు. పవన కళ్యాణ్ - అజ్ఞాతవాసి లో ఒక కీలక పాత్ర చేశారు. ఇటీవల ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయ్యింది. సంక్రాంతి కానుకగా సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.