Begin typing your search above and press return to search.
నా కిడ్నీలు పాడైపోయాయి చనిపోవడం ఖాయమన్న వైద్యులుః రానా
By: Tupaki Desk | 24 March 2021 8:00 PM IST'నా కిడ్నీలు పాడైపోయాయి. బ్రెయిన్ 70 శాతం హ్యామ్రేజ్ అయ్యింది. కాబట్టి, నేను బతికే ఛాన్స్ చాలా తక్కువని వైద్యులు తేల్చారు' అని వెల్లడించారు హీరో రానా దగ్గుబాటి. ప్రస్తుతం.. ఆయన అప్ కమింగ్ మూవీ 'అరణ్య' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా చిత్ర షూటింగ్ లో ఎదురైన అనారోగ్య సమస్య గురించి వివరించారు.
అరణ్య చిత్రీకరణ సమయంలో తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడినట్టు చెప్పారు రానా. కిడ్నీలు ఫెయిలయ్యాయని, తాను బతికేది 30 శాతమేనని వైద్యులు చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఈ విషయం తెలిసి తన కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళనకు గురయ్యారని అన్నారు.కానీ.. అనారోగ్యం నుంచి సురక్షితంగా బయట పడ్డానని తెలిపారు. ఆ తర్వాతే మళ్లీ సినిమా షూట్ కొనసాగిందని చెప్పారు. అప్పటి వరకూ దర్శకుడు తనకోసం వేచి ఉన్నారని, ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు రానా.
కాగా.. అరణ్య చిత్రం ఈ నెల 26వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అడవులను ధ్వంసం చేసే కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఈ సినిమా రూపొందినట్టు సమాచారం. ప్రభు సోలోమన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో.. రానాతోపాటు విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పిలగావోంకర్ తదితరులు నటించారు. శంతను మోయిత్రా సంగీతం అందించారు.