Begin typing your search above and press return to search.
నా వల్లే నాన్నకు ఆ పరిస్థితి వచ్చిందిః శివాని
By: Tupaki Desk | 24 March 2021 10:00 AM ISTగత ఏడాది సీనియర్ హీరో రాజశేఖర్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. జీవిత.. శివాని మరియు శివాత్మికలు ఈజీగానే కరోనాను జయించినా కూడా రాజశేఖర్ మాత్రం తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. వెంటిలేటర్ పై ఆయన్ను ఉంచి చికిత్స అందించారు. దాంతో ఆయన పరిస్థితి గురించి మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. చాలా సీరియస్ గా ఉన్నారని ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లుగా వైధ్యులు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. దాదాపు రెండు వారాల పాటు రాజశేఖర్ తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొని చావుతో పోరాడారు అంటూ ఆయన సన్నిహితులు చెప్పారు. కరోనాతో పోరాడి రాజశేఖర్ గెలిచారు. ఆయన మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు. ఈ సమయంలో ఆయన పెద్ద కూతురు శివాని గతంలో తన తండ్రి ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలపై ఎమోషనల్ అయ్యింది.
తాజాగా శివాని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాన్న కు కరోనా సోకడానికి కారణం నేనే. అమ్మా నాన్న జాగ్రత్తగా ఇంటికే పరిమితం అయ్యి ఉన్నా కూడా నేను మాత్రం మాత్రం బయట తిరిగేదాన్ని బయటి నుండి కరోనా నా ద్వారా నాన్నకు సోకింది. ఆసుపత్రిలో నాన్న ఉన్న సమయంలో నా వల్లే నాన్నకు ఈ పరిస్థితి అంటూ నేను ఎంతో మానసిక క్షోభను అనుభవించాను. నాకు చిన్నతనంలోనే గుండె సమస్య ఉంది. నాన్న ఆసుపత్రిలో ఉన్న సమయంలో తీవ్ర మానసిక క్షోభకు గురవ్వడంతో నా గుండె సమస్య మళ్లీ తిరగబెట్టినట్లయ్యింది. ఆసుపత్రిలో ఒక వైపు నాన్న కరోనా చికిత్స చేయించుకుంటూ ఉంటే మరో వైపు నాకు గుండె సంబంధించిన చికిత్స జరిగింది. ఆ సమయంను తల్చుకుంటేనే ఆందోళనగా ఉందని ఇప్పుడు అంతా సెటిల్ అవ్వడంతో మా కుటుంబం ఊపిరి పీల్చుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.