Begin typing your search above and press return to search.

ఫేక్ బ్రెస్టు తీసేసి మరీ చూపించింది

By:  Tupaki Desk   |   4 Jun 2016 4:17 AM GMT
ఫేక్ బ్రెస్టు తీసేసి మరీ చూపించింది
X
2013లో బిగ్‌ బాస్‌ కార్యక్రమం ద్వారా ఇండియా అంతటా పాపులర్‌ అయ్యింది భారత సంతతికి చెందిన బ్రిటన్‌ మోడల్‌ సోఫియా హయత్‌. వచ్చీ రావడంతోనే మితిమీరిన స్కిన్‌ షో తో ఎట్రాక్ట్ చేయాలని ప్రయత్నించింది. అది చాలదన్నట్లు అమ్మడు సిలికాన్ ఇంప్లాంట్‌ సర్జరీ ద్వారా తన వక్షోజ సౌందర్యాన్ని వృద్ది చేసుకుని.. వాటిని భారీగా ఎక్సపోజ్ చేస్తూ బాలీవుడ్ లో మామూలు హడావుడి చేయలేదనుకోండి.

సడన్‌ గా ఏమి జరిగిందో తెలియదు కాని.. జూలై 2015లో జరిగిన ఓ సంఘటనతో ఆమెకు జ్ఞానోదయం అయ్యిందట. అప్పటి నుండి సన్యాసినిగా మారిపోయాను అంటోంది. దాదాపు 2010 నుండి సొంత మ్యూజిక్ ఆల్బమ్ లను.. చిన్ని చిన్ని బికినీల్లో అందాలను ఆరబోస్తూ చేసిన పాటలను రిలీజ్ చేసిన సోఫియా.. ఇప్పుడు గయా మథర్‌ సోఫియా గా పేరు మార్చుకుంది. తనలో ఎటువంటి వాంఛలూ లేవంట. సెక్స్ అనేది ఇక ఆమెకు అవసరం లేదట. జీవితంలో అన్నీ చూసేశా.. ఇప్పుడు కేవలం అందరికీ ఆ ముక్తి మార్గం బోధించడమే అని చెప్పుకొచ్చింది.

నిన్న ముంబయ్‌ లో నన్ అవతారంలో వచ్చి ఒక మీటింగ్‌ పెట్టిన సోఫియా.. ఏకంగా తాను గతంలో వాడిన సిలికాన్‌ ఇంప్లాంట్ లను కూడా తీసుకొచ్చి.. ఈ ఫేక్‌ బ్రెస్టుతో నాకు పనిలేదు అంటూ వాటిని మీడియా ముందు ఉంచింది. దీనితో అందరూ షాక్‌ తిన్నారంతే. అయితే గతంలో రాఖీ సావంత్ కూడా ఇలాగే క్రిస్టియన్‌ నన్‌ క్రింద మారిపోయానంటూ రెండు సంవత్సరాలు సన్యాసినిగా కనిపించి.. తరువాత మళ్ళీ మామూలు మామూలు జీవితంలోకి వచ్చేశా అనేసింది. మరి సోఫియా ఏం చేస్తుందో?