Begin typing your search above and press return to search.

అన్నీ చూపించనుంటున్న ఇల్లీ బేబీ

By:  Tupaki Desk   |   15 Oct 2016 11:11 AM IST
అన్నీ చూపించనుంటున్న ఇల్లీ బేబీ
X
గోవా బ్యూటీ ఇలియానా బాగా హాట్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య ఈ హాట్ నెస్ లో డోస్ బాగా పెరిగింది కూడా. పైగా అమ్మడి నేచురల్ అందాలను కూడా బయటపెట్టేస్తూ ఈ మధ్య బోలెడన్ని ఫోటోలు బయటకొస్తున్నాయి. ఇందుకు కారణం ఆమె ఆస్ట్రేలియన్ లవర్ ఆండ్రూ నీబోన్. స్వతహాగా ఫోటోగ్రాఫర్ అయిన అండ్రూ.. తన ప్రేయసిలోని అందాలను ఫోటోలుగా మలిచి అభిమానులకు అందాల విందు అందించడం కోసం బోలెడంత కష్టపడుతున్నాడు.

'నేనెప్పుడూ డోంట్ కేర్ అనే పద్ధతిలో ఉంటాను. నాకు తగ్గవాడే ఆండ్రూ కూడా. తనో అద్భుతమైన ఫోటోగ్రాఫర్. మిగతా ఫోటోగ్రాఫర్లు చూసినట్లు కాకుండా డిఫరెంట్ గా నన్ను ప్రెజెంట్ చేస్తాడు. మేకప్ లో లేకుండా కూడా నన్ను ఎంతో అద్భుతంగా చూపించగలడు. తను నా శక్తి-ధైర్యం. నా సినిమాలను కూడా ఎంతో ప్రేమిస్తాడు.. ఇష్టపడతాడు' అంటున్న ఇలియానాకి.. మీరు నటించిన అన్ని సినిమాలు చూపిస్తారా అనే ప్రశ్న ఎదురైంది. 'నేను నా సినిమాల్లో మంచి వాటిని మాత్రమే చూపిస్తా' అంటూ తన సెన్సార్ షిప్ ని బయటపెట్టేసింది.

ప్రస్తుతం అజయ్ దేవగన్ మూవీ బాద్ షాహో లోను.. అర్జున్ కపూర్ మూవీ ముబారకన్ లోను ఇల్లీ బేబి నటిస్తోంది. రీసెంట్ గా అక్షయ్ కుమార్ తో చేసిన రుస్తుం సక్సెస్ కావడం.. అమ్మడికి బాలీవుడ్ లో మళ్లీ డిమాండ్ పెంచేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/