Begin typing your search above and press return to search.
అప్పుడు చేసిన తప్పుకు ఇప్పుడు బాధపడటం ఎందుకు అమ్మడు?
By: Tupaki Desk | 4 March 2020 12:00 PM ISTసినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా రాణించాలి అంటే అందం.. అభినయంతో పాటు కాస్త తెలివి కూడా ఉండాలి అనేది పెద్దల మాట. వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ను ఒప్పుకోకుండా ఆచితూచి అడుగులు వేయాలి. అదే సమయంలో మంచి ఆఫర్ వచ్చిన సమయంలో వేరే చిన్న ఆఫర్లను చూసుకుని వదిలేసుకుంటే చాలా పెద్ద తప్పు చేసిన వారు అవుతారు. అందుకే సినిమాల ఎంపిక విషయంలో తెలివి కావాలి కనుక హీరోయిన్ గా స్టార్ డం పొందేందుకు తెలివి కూడా అవసరం అంటారు. అలా తెలివిగా అడుగులు వేయక పోవడంతో తన కెరీర్ ఇలా అయ్యిందని అర్చన బాధపడుతోంది.
తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించడంతో పాటు.. తెలుగు బిగ్ బాస్ తో ప్రేక్షకులకు మరింత దగ్గర అయిన ముద్దుగుమ్మ అర్చన ఇటీవలే వివాహం చేసుకుంది. కెరీర్ లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న ఆమె చివరకు పెళ్లితో ఇండస్ట్రీకి బైబై చెప్పింది. ఇంకా వెయిట్ చేస్తే ఆఫర్లు రాకపోవచ్చు అనుకుని పెళ్లి చేసుకుందంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అర్చన తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
గతంలో తనకు ‘మగధీర’ చిత్రంలో సలోని పోషించిన పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఆ సమయంలో తాను హీరోయిన్ గా చేయాలనే ఉద్దేశ్యంతో ఆ ఆఫర్ ను వదిలేశాను. మగధీర వంటి సినిమాను వదిలేయడం అనేది నా జీవితంలో చేసిన పెద్ద తప్పు. ఆ తప్పు కారణంగా నా కెరీర్ లో చాలా మార్పు మిస్ అయ్యాను. అది కాకుండా ఇంకో పెద్ద సినిమాలో కూడా ఛాన్స్ వదిలేశాను అంటూ అప్పటి తప్పుకు ఇప్పుడు తెగ బాధపడిపోయింది. అయినా ఎప్పుడో జరిగి పోయిన తప్పుకు ఇప్పుడు బాధపడి మాత్రం ఏం లాభం... నీ కెరీర్ ఎంత వరకు సాగిందో అదే బెటర్ అనుకుని హాయిగా ఫ్యామిలీ జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చుగా అంటూ నెటిజన్స్ అర్చనకు సలహా ఇస్తున్నారు.