Begin typing your search above and press return to search.

నా యాక్సిడెంట్ పీడకల కాదు.. స్వీట్ మెమోరీ: SDT

By:  Tupaki Desk   |   2 April 2023 12:30 AM IST
నా యాక్సిడెంట్ పీడకల కాదు.. స్వీట్ మెమోరీ: SDT
X
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. తేజ్ సుప్రీం హీరోగా తనదైన బ్రాండ్ ఇమేజ్ తో దూసుకుపోతున్నారు.  ఇదిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ గతంలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో ప్రాణం పోయే స్థితికి మరల బ్రతికి బయటపడ్డారు.

రోడ్డు ప్రమాదం తర్వాత విరూపాక్ష సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 21న మూవీ రిలీజ్ కాబోతుంది. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాని కార్తిక్ దండు తెరకెక్కించారు. ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోవడంతో ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సాయిధరమ్ తేజ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

అదే సమయంలో తన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ప్రమాదం జరిగి తాను మంచాన ఉంటే చాలామంది ట్విట్టర్ లో ట్రోల్ చేశారని తేజ్ పేర్కొన్నారు.

అయితే ఆ ట్రోల్ కి తానేమి బాధపడటం లేదని అన్నారు. ప్రమాదం ఎప్పుడు కూడా పీడకల కాదని, అదొక స్వీట్ మెమోరీ అని తెలిపారు.

భవిష్యత్తులో సరైన విధంగా ఆలోచించడానికి అదొక మంచి లెస్సన్ కింద ఉంటుందని అన్నారు. భయాన్ని మించి ఎదగాలని అమ్మ తనకి నేర్పిందని, దానినే ఇప్పుడు ఫాలో అవుతున్న అని తేజ్ అన్నారు. అలాగే ప్రమాదం తర్వాత తన ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది అని పేర్కొన్నారు. ఇద్దరు మామయ్యలతో నటించే అవకాశం తనకి వచ్చిందని అన్నారు.

భవిష్యత్తులో పెదమామయ్య మెగాస్టార్ చిరంజీవితో కూడా కలిసి నటిస్తానని సాయి ధరమ్ తేజ్ చెప్పడం విశేషం. ప్రస్తుతం తేజ్ వినోదాయ సీతమ్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపిస్తూ ఉన్నాడు. ఇక విరూపాక్ష మూవీతో  సూపర్ హిట్ కొట్టడానికి తేజ్ రెడీ అవుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.