Begin typing your search above and press return to search.

క‌బాలి వెండి నాణేలు రెడీ

By:  Tupaki Desk   |   15 July 2016 2:41 PM GMT
క‌బాలి వెండి నాణేలు రెడీ
X
సౌత్ ఇండియ‌న్ సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ ఏ ముహూర్తాన క‌బాలి సినిమాను స్టార్ట్ చేశాడో గాని..ఈ సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది క‌బాలి ఫీవ‌ర్‌ తో ర‌జ‌నీ అభిమానులు - సౌత్ ఇండియా సినీజ‌నాలు ఊగిపోతున్నారు. క‌బాలి థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు మ‌రో ఆరు రోజులు మాత్ర‌మే ఉంది. దీంతో ఇప్పుడు అంద‌రు క‌బాలి మానియాలో మునిగి తేలుతున్నారు. క‌బాలి ఈ నెల 22న ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే క‌బాలి క్రేజ్‌ ను క్యాష్ చేసుకునేందుకు చిత్ర నిర్మాత‌లు అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని యూజ్ చేసుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్‌ కు మ‌రో వారం రోజుల టైం మాత్ర‌మే ఉండ‌డంతో ఈ సినిమా క్రేజ్‌ కు అనుగుణంగా చిత్ర నిర్మాత‌లు ప్ర‌చారాన్ని కొత్త పుంత‌లు తొక్కించేస్తున్నారు. త‌మిళ‌నాడులో ఇప్ప‌టికే స‌గం బ‌స్సుల్లో - ట్రైన్ల‌లోను క‌బాలి పోస్ట‌ర్లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. చెన్నైతో పాటు ప‌లు ప్రధాన న‌గ‌రాల్లో పెద్ద పెద్ద హోర్టింగ్‌ లు పెట్టేశారు.

ఫ్లైట్స్ మీద సైతం క‌బాలి పోస్ట‌ర్లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇక క‌బాలి రిలీజ్ డే నాడు బెంగ‌ళూరు - ముంబై న‌గ‌రాల నుంచి ర‌జ‌నీ అభిమానుల‌ను చెన్నైకు స్పెష‌ల్ ఫ్లైట్స్‌ లో వ‌చ్చి సినిమాను వీక్షించేందుకు ప్ర‌త్యేక ప్యాకేజీలు రెడీ అయ్యాయి. క‌బాలి క్రేజ్‌ ను క్యాష్ చేసుకునేందుకు ప్ర‌ముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌ టెల్ ప్ర‌త్యేకంగా సిమ్‌ ను విడుద‌ల చేయ‌డంతో పాటు ర‌క‌ర‌కాల ప్యాకేజీలు రూపొందించింది. ప్ర‌స్తుతం మార్కెట్లో క‌బాలి ఎయిర్‌టెల్ సిమ్‌ లు విరివిగా దొరుకుతున్నాయి.

ఇక ఈ నేప‌థ్యంలోనే క‌బాలి క్రేజ్‌ ను బంగారు ఆభ‌ర‌ణాల సంస్థ అయిన ముతూట్ ఫైనాన్స్ సంస్థ కూడా వాడుకోనుంది. ముతూట్ ఫైనాన్స్ సంస్థ క‌బాలి వెండి నాణేలు రిలీజ్ చేసింది. 5 - 10 - 20 గ్రాములున్న వెండి నాణేలను ఈ సంస్థ మార్కెట్ లో ప్ర‌వేశ‌పెడుతోంది. వీటి ధ‌ర రూ.350 - 700 - 1400 గా ఉన్నాయి. వీటిని శుక్రవారం నుంచి ఆన్‌ లైన్‌ లో బుక్ చేసుకోవ‌చ్చు. అయితే సినిమా రిలీజ్ అయ్యాకే వీటి డెలివ‌రీ ఉంటుందని ముతూట్ సంస్థ ప్ర‌క‌టించింది. ర‌క‌ర‌కాలుగా కొత్త పుంత‌లు తొక్కుతున్న క‌బాలి ప్ర‌చారం రిలీజ్ డే నాటికి ఇంకెన్ని వింత‌లు క్రియేట్ చేస్తుందో చూడాలి.