Begin typing your search above and press return to search.

సంధ్యరాజుగారి సంకల్పం కోసం 'నాట్యం' చూడాలి: చరణ్

By:  Tupaki Desk   |   17 Oct 2021 3:08 AM GMT
సంధ్యరాజుగారి సంకల్పం కోసం నాట్యం చూడాలి: చరణ్
X
'నాట్యం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన చరణ్, ప్రధానమైన పాత్రను పోషించిన సంధ్య రాజు గురించి ప్రస్తావించారు. "ఏడెనిమిదేళ్ల క్రితం ఇదే వేదికపై సంధ్యగారి కూచిపూడి ప్రదర్శన చూశాను. అలాంటి ఒక సంధ్య రాజుగారు ఇంత ప్యాషన్ తో .. ఇంత డెడికేటెడ్ గా ఒక సినిమా తీయడం గొప్ప విషయం. ఆమెనే ఈ సినిమాలో నటించడం .. ప్రొడ్యూస్ చేయడం .. డిజైన్ చేయడం అంతతేలికైన విషయమేం కాదు.

సంధ్యగారిలో ఇంత ప్యాషన్ ఉంటుందని నేను ఉహించలేదు. ఆమె గురించి ఎంతగా చెప్పిన తక్కువే అవుతుంది. మేము సినిమా తీయాలనుకుంటే ఒక పదిమంది అబ్బాయిలం .. లేదంటే ఒక ఇరవైమంది అబ్బాయిలం కలిసి కష్టపడి ఒక సినిమా తీస్తాము. అలాంటి కష్టాన్ని పడుతూ ఒకే ఒక అమ్మాయి సాధించింది .. అది సంధ్యారాజుగారు. నిర్మాతగా ఉండికూడా ఆ స్ట్రెస్ తీసుకోకుండా, కొరియోగ్రఫీని చూసుకుంటూ .. బట్టలను డిజైన్ చేయిస్తూ .. ఇంత క్వాలిటీతో సినిమా తీయడమనేది అంత తేలికైన విషయమేం కాదు.

ఒక స్త్రీ పవర్ ఎలా ఉంటుందనేది ఈ సినిమాతో మీరు చూడబోతున్నారు. ఈ సినిమా తరువాత ఆమెకంటూ నిర్మాతలు . దర్శకులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపై ఆమె ఇంతగా కష్టపడకూడదు. ఒక మంచి నటిగా ఆమెను నేను మళ్లీ తెరపై చూడాలని అనుకుంటున్నాను. ఒక సినిమాకి ప్రొడక్షన్ చేయడమనేది ఎంత కష్టమో నాకు తెలుసు. ఎవరికోసమో కాదు .. సంధ్యగారి సంకల్పం కోసమైనా ఒకసారి ఈ సినిమా చూడాలి. సంకల్పం బలంగా ఉంటే ఏదైనా సాధించగలమనడానికి నిదర్శనంగా సంధ్యారాజుగారిని .. రేవంత్ కోరుకొండను చూపించవచ్చు.

ప్రస్తుతం బయట అన్ని రెస్టారెంట్లు .. బార్లు .. అన్నిటికీ వెళుతున్నారు. తింటున్నాము .. ఎంజాయ్ చేస్తున్నారు. అంతే జోష్ తో మనం సినిమా థియేటర్లకు వెళదాం .. ఎంజాయ్ చేద్దాం .. పూర్వవైభవాన్ని తీసుకొద్దాం. ఈ మధ్య థియేటర్లకు వచ్చిన చాలా సినిమాలు హిట్ అయ్యాయి. 'బ్యాచ్ లర్' కూడా హిట్ అయిందని విన్నాను. ఇంకా చాలా సినిమాలు థియేటర్లకు వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫాస్టు లైఫ్ అలవాటైపోయి, ఈ సినిమా మనకి కనెక్ట్ అవుతుందా అని అనుకుంటాం.

నన్ను ఈ సినిమాను చూడమని చెప్పినప్పుడు కూడా .. కేవలం డాన్స్ గురించి మాత్రమే చెబుతారా? హెవీగా ఉంటుందా? అనుకున్నాను. కానీ అబ్బాయిలు నేను చెబుతున్నాను .. ఇది బ్యూటిఫుల్ గా డిజైన్ చేసిన సినిమా. డాన్స్ అనేది ఒక బేస్ మాత్రమే .. సినిమాలో డ్రామా .. ఎమోషన్స్ ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి. అవి అందరికి కనెక్ట్ అవుతాయి" అని చెప్పుకొచ్చాడు.