Begin typing your search above and press return to search.

బాలకృష్ణ పైసా వసూల్లో కొత్త నారి

By:  Tupaki Desk   |   21 Jun 2017 5:06 AM GMT
బాలకృష్ణ పైసా వసూల్లో కొత్త నారి
X
గౌతమీపుత్ర శాతకర్ణి విజయం తరవాత వస్తున్న క్రేజీ కాంబినేషన్ పూరీ జగన్నాధ్ - బాలకృష్ణ సినిమా సెప్టెంబర్ 29 నాడు విడుదల చేయడానికి అన్నీ సిద్దం చేస్తున్నారు. బాలయ్య ఈ సినిమా కోసం పోర్చుగల్ లో వీరోచిత పోరాటాలు కూడా చేస్తున్నాడు. మాఫియా డాన్ గా నటించబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీయ శరణ్ నటిస్తుంది అని మనకు తెలుసు. కాకపోతే శ్రీయ మెయిన్ లీడ్ కాదట. ఇంకో నూతన నటి సినిమాలో 1వ హీరోయిన్ అని తెలుస్తోంది.

కాకపోతే ఆమె పేరు ముస్కాన్ అని తప్పించి.. ఇప్పటివరకు ఆ భామ తెలియలేదు ఎవ్వరికీ. ఈ మధ్యనే చిత్ర యూనిట్ ఆ కొత్త నటి ఫోటోను విడుదల చేశారు. ముస్కాన్ సేథి అనే ఒక కొత్త నటిని ఎన్నుకున్నాం అని ప్రకటించారు. ఈమెకు ఈ సినిమానే మొదటి సినిమా కావడం కొసమెరుపు. మోడల్ గా పని చేస్తున్న ఈమె ఇప్పుడు ఈ సినిమాలో బాలయ్యతో కలిసి చిందులు వేయబోతుంది అని చెబుతున్నారు. ఇంకా మీడియాకు పూర్తి వివరాలు ఇవ్వలేదు మూవీ యూనిట్. కాని ఈ అమ్మాయి ముంబయ్ మోడలింగ్ సర్క్యూట్ లో బాగా సుపరిచితురాలే. తన సెక్సీ షూట్లతో ర్యాంప్ వాకులతో బాగానే పిచ్చెత్తిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ సుమారుగా పూర్తి అయ్యిందిని చెబుతున్నారు. బాలకృష్ణ పాత్ర కోసం నేషనల్ పాపులర్ స్టైలిస్ట్ ని తీసుకున్నారు అని తెలుస్తుంది. సినిమా పోస్టర్ కూడా విడుదలై మంచి ఆశక్తి రేపింది ప్రేక్షకులులలో. భవ్య క్రియేషన్స్ వాళ్ళు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం అనూప్ రుబెన్స్ ఇస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/