Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ముస్కాన్ మిసమిసలు

By:  Tupaki Desk   |   30 Aug 2017 8:50 AM GMT
ఫోటో స్టోరి: ముస్కాన్ మిసమిసలు
X
టాలీవుడ్ లో బాలయ్య101 ఫీవర్ బాగానే అంటుకుంది. అసలే బాలయ్య డైలాగులు చెప్పాడంటే థియేటర్స్ లో అరుపులు ఓ రేంజ్ లో ఉంటాయి. ఇక పూరి జగన్నాథ్ ఈ సారి ఆయనతో చెప్పించే డైలాగులు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి.అలాగే పూరి సినిమాలో హీరోయిన్స్ ని ఏ స్టైల్ లో చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా హీరోయిన్స్ పక్కన ఒక వెరైటీ క్యారెక్టర్ తప్పకుండా ఉంటుంది.

ఇప్పుడు మళ్ళీ అదే ఫార్ములాతో పూరి ముస్కన్ సేథీని తెచ్చాడు. పైసా వసూల్ లో అసలైన హీరోయిన్ శ్రీయనే అయినా ముస్కన్ కూడా బాలయ్యతో రొమాన్స్ చేస్తోందట. ఇప్పటికే ఈ అమ్మడు సోషల్ మీడియాలో తెగ పాపులర్ అవుతోంది. తన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అభిమానులను ఆకర్షిస్తోంది. రీసెంట్ గా ఓ ఫోటో షూట్ ఇచ్చిన ఈ అమ్మడు ఆ ఫొటోలో అందమైన వెస్టర్న్ దుస్తులతో చాలా సెక్సీగా గా కనిపిస్తోంది. చూసినవారంతా ముస్కన్ కోసం మూవి చూడాల్సిందేనని అంటున్నారు. అయితే మొన్నటివరకు ఒక్క సాంగుతో కూడా ముస్కాన్ ను పెద్దగా క్రేజ్ ఏర్పడలేదు కాని.. ఇప్పుడు ఈ ఫోటోలతో మాత్రం కాస్త అటెన్షన్ వస్తోంది.

రీసెంట్ గా బాలయ్యనే ఆమె మరో బాపు బొమ్మ అని సంబోధించడం చూస్తుంటే అర్ధం చేసుకోవచ్చు.. ముస్కన్ సేథీ అందాలు సినిమాలో ఎలా మిసమిసలు ఆడనున్నాయో. మొదటి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ అమ్మడికి పైసా వసూల్ ఎలాంటి అవకాశాలను తెచ్చిపెడుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ ఫోటోలతో మాత్రం బాగానే ఊరిస్తోంది.