Begin typing your search above and press return to search.

బికినీల్లో పైసా వసూల్ బేబి భలే

By:  Tupaki Desk   |   25 Jun 2017 6:20 AM GMT
బికినీల్లో పైసా వసూల్ బేబి భలే
X
బాలకృష్ణ తన 101 వ సినిమాలో ఇప్పటి వరకు నటించని విదంగా నటిస్తున్నాడు, కనిపించని విదంగా కనపడుతున్నాడు అంటూ ఆల్రెడీ దర్శకుడు పూరి జగన్ పబ్లిసిటీ స్టార్ట్ చేశాడు. అదంతా ఏమో కాని.. ఇప్పుడు మరో కొత్తదనం వచ్చింది పైసా వసూల్ సినిమాకు. ఈ సినిమాలో శ్రీయతో పాటుగా మరో నూతన నటి ముస్కాన్ సేతీ కూడా నటిస్తోంది. ఈమే మెయిన్ హీరోయిన్.

ఇకపోతే ముస్కాన్ ఇంతవరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. మోడలింగ్ చేస్తూ బొంబాయ్ ఫ్యాషన్ సర్కిల్ లో బిజీ మోడల్ గా చెలామణి అవుతున్న ఈ సుందరి డైరెక్ట్ గా తెలుగు హీరోయిన్ అయ్యింది. షూటింగ్ లో ఉందో లేక విహారంలో ఉందో కానీ కెరటాలను పలకరించడానికి వెళ్ళుతున్న గువ్వపిట్ట లాగా రెడీ అవుతుంది. బికినీ వేసుకొని దానిపై తెల్లటి పలచని టాప్ కప్పి బీచ్ విహారంలో స్పెయిన్ లో బిజీగా ఉంది. తెల్లని సోఫాలో తన అందాన్ని వొలకబోస్తూ మధురంగా నవ్వుతూ అక్కడ ఎండకు చల్లగా తాగుతూ చూసే వాళ్ళకు వేడిని పెంచుతూ ఇలా దర్శనం ఇచ్చింది. అదే బీచ్ లో బికినీ టాప్ లో కూడా చెక్కర్లు కొడుతూ ఇంకా హడావుడి చేసింది.

ఒకవేళ సినిమాలో కూడా ఇదే రేంజు గ్లామర్ తో రెచ్చిపోతే.. తొలి సినిమాతోనే టాలీవుడ్ లో ఒక రేంజుగా బిజీ అయిపోతుందేమో. ఏదేమైనా కూడా పూరి జగన్ ఇటువంటి హాటీలను వెతికిపట్టుకుని వెండితెరకు తీసుకురావడంలో భలే నిష్టాతుడు అనే చెప్పాలి. చిరుతలో నేహా శర్మ.. లోఫర్ లో దిశా పటాని ఇటువంటి హాట్నెస్ తోనే పిచ్చెక్కించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/