Begin typing your search above and press return to search.

పూరీ హీరోయిన్లు ఎందుకో ఎక్కట్లేదు

By:  Tupaki Desk   |   25 Aug 2017 5:30 PM GMT
పూరీ హీరోయిన్లు ఎందుకో ఎక్కట్లేదు
X
టాలీవుడ్ ఆడియన్స్ ఎవరినైనా నమ్మితే.. ఓ పట్టాన వదిలిపెట్టేయడం చాలా కష్టమైన విషయం. ఒక సారి స్టార్ స్టేటస్ వచ్చా.. వాళ్లు ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా.. ఒకోసారి మాట తూలినా.. మళ్లీ మళ్లీ నమ్ముతూనే ఉంటారు. అభిమానిస్తూనే ఉంటారు. ఇది టాలీవుడ్ ప్రేక్షకుల వీక్నెస్ అయితే.. దీన్ని బేస్ చేసుకుని రీబౌండ్ అయిన వాళ్లు చాలామందే ఉంటారు. ఇప్పుడు పూరీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. బౌన్స్ బ్యాక్ అయేందుకు పూరీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. కానీ అవేవీ సక్సెస్ కాని సిట్యుయేషన్ లో.. నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం పైసా వసూల్ చేసే అవకాశం రావడం.. మరోవారంలో రిలీజ్ కి రెడీ చేసేయడం జరిగిపోయాయి.

తన సినిమాల్లో కొత్త కొత్త భామలను తీసుకురావడం పూరీ జగన్నాధ్ కు అలవాటు. అంతే కాదు.. పూరీ తెచ్చే భామలకు తెగ క్రేజ్ ఉంటుందనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. అది వాస్తవమే అయినా.. అసలు పూరీ తెచ్చిన భామలు అంతో ఇంతో పేరు తెచ్చుకుని చాలా కాలమే అయింది. కెరీర్ తొలి నాళ్లలో ఇలియానా(రెండో సినిమా).. రక్షిత.. ఆశిన్ లాంటి కొందరు హీరోయిన్స్ బాగానే క్లిక్ అయ్యారు. ఆ తర్వాత లెక్కకు మించి హీరోయిన్స్.. ఐటెం భామలను పూరీ పట్టుకొచ్చినా అందులో మెప్పించింది మాత్రం కొందరే. రీసెంట్ గా అయితే ఇజం మూవీతో అదితి ఆర్యను తీసుకొచ్చినా ఒరిగిందేమీ లేదు. రోగ్ అంటూ అప్పటికే ఫెయిల్యూర్స్ లో ఉన్న మన్నారా చోప్రా.. ఏంజెలా క్రిస్లింకీ కెరీర్ లకు ఏ మాత్రం హెల్ప్ కాలేకపోయాడు.

ఇక ఇప్పుడు పైసా వసూల్ తో ముస్కాన్ సేథిని తీసుకొస్తున్నాడు పూరీ. ఇదే సినిమాతో కైరా దత్ కూడా కనిపించనుంది. అయితే.. ట్రైలర్ వరకూ చూస్తే మాత్రం వీరిపై ఎవరి ఫోకస్ పడలేదు. సినిమా రిలీజ్ అయ్యాక అయినా సిట్యుయేషన్ ఎలా ఉంటుందో.. పూరీ కొత్త భామ ముస్కాన్ సేథీ ఎలా మురిపిస్తుందో.. పైసా వసూల్ అనిపిస్తుందో లేదో అనే విషయంలో.. అందరిలోనూ అంచనాల కంటే అనుమానాలే ఎక్కువగా ఉన్నాయి. అసలు పూరి హీరోయిన్లు ఎందుకో ఎక్కట్లేదు అంటూ ఇప్పటికే జనాలు పెదవి విరిచేస్తున్నారు.