Begin typing your search above and press return to search.

మ్యూజిక్ డైరెక్టర్ల కోల్డ్ వార్

By:  Tupaki Desk   |   16 May 2019 5:30 PM GMT
మ్యూజిక్ డైరెక్టర్ల కోల్డ్ వార్
X
టాలీవుడ్ లో ప్రస్తుతం సంగీత దర్శకుల కొరత ఉన్న మాట వాస్తవం. నెంబర్ పరంగా చెప్పుకోవడానికి చాలానే ఉన్నారు కాని స్థిరంగా మంచి ఆల్బమ్స్ ఇస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రం లేరు. ఒకటి హిట్ అయితే వరసగా ఓ మూడు తేడా కొట్టడం అందరి విషయంలో జరుగుతున్నదే. ఎంత మంది ఉన్నా టాప్ పొజిషన్ కోసం మాత్రం ఇద్దరి మధ్యే పోటీ నెలకొని ఉంది. ఒకరు దేవిశ్రీ ప్రసాద్ రెండు తమన్.

బయటికి కనిపించకపోయినా ఇద్దరి మధ్య ఒకరకమైన కోల్డ్ వార్ ఉందని సన్నిహితులు అంటుంటారు. దానికి ఉదాహరణగా దీన్ని చెప్పొచ్చు. ఇటీవలే మహర్షికి ఆశించిన స్థాయిలో అవుట్ పుట్ ఇవ్వలేకపోయిన దేవి రెండు పాటలకు మాత్రమే పాస్ మార్కులు తెచ్చుకున్నాడు. మహేష్ ఎంత పొగిడినా వాస్తవాలు వేరు. త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న అనిల్ రావిపూడి సినిమాకూ దేవినే ఉండొచ్చనే వార్తలు మొదలయ్యాయి

ఈ సందర్భంగా ఓ మహేష్ అభిమాని ఈ సినిమాకు మాత్రం దేవిని కాకుండా తమన్ ని తీసుకోమని సూచిస్తూ దూకుడు తాలుకు ఇంట్రో క్లిప్ కూడా అందులో పొందుపరిచాడు. ఆ కామెంట్ లో దేవిని కొంచెం ఘాటుగానే కౌంటర్ చేశాడు సదరు ఫ్యాన్. దీనికి తమన్ లైక్ కొట్టేశాడు. అంటే అతని అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్టు చెప్పినట్టే.

ఇది కాస్తా దేవి అభిమానుల కంటబడింది. వాళ్ళూ తమన్ ఫెయిల్ అయిన క్లిప్స్ తో కౌంటర్ ఇచ్చే పనిలో పడ్డారు. ఏది ఏమైనా ఒక చిన్న లైక్ ఒకోసారి చాలా దూరం వెళ్ళిపోయి ఎన్నో రకాల అర్థాలు ఇస్తుంది. తమన్ ట్వీట్ చదివి లైక్ కొట్టాడో లేదో కాని ఇద్దరి మధ్యా కోల్డ్ వార్ ఉందన్న సంకేతం ఇచ్చాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది