Begin typing your search above and press return to search.

ప్రభాస్ ఆఫర్.. థమన్ ఇంకాస్త గట్టిగా కొట్టి ఉంటే.. 

By:  Tupaki Desk   |   19 Dec 2022 2:30 AM GMT
ప్రభాస్ ఆఫర్.. థమన్ ఇంకాస్త గట్టిగా కొట్టి ఉంటే.. 
X
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు థమన్ పేరు గట్టిగానే వినిపిస్తోంది. అఖండ సినిమా నుంచి అతని క్రేజ్ మరికొంత పెరిగింది. ఆఫర్లు బాగానే వస్తున్నాయి. అయితే తమన్ ఇంకా హై రేంజ్ లో అగ్ర హీరోల సినిమా అవకాశాలను అందుకోవాలని ఎదురుచూస్తున్నాడు. ప్రభాస్ తో సినిమా చేయాలి అని ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు.

ఆ మధ్య ఆఫర్ వచ్చినట్లే వచ్చి ఒక్కసారిగా చేజారిపోయింది. ఇక రీసెంట్ గా రాధే శ్యామ్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించినప్పటికీ కూడా అతనికి మరో సినిమా అవకాశం అయితే ఈజీగా దొరకలేదు. మారుతీతో మంచి బాండింగ్ ఉండటం వలన అతడు ప్రభాస్ తో చేయబోయే సినిమాకు ఆఫర్ వస్తోందేమో అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు.

నిజానికి థమన్ ను ఫైనల్ చేయాలని కూడా ప్రభాస్ మొదట అనుకున్నాడు. కానీ థమన్ ఇటీవల కొంత ఆలోచనలు పడేసాడు. ఎందుకంటే అతని తదుపరి సినిమా వీరసింహారెడ్డి సినిమాకు ఉంది మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలోని పాటలు అనుకున్నంత స్థాయిలో అయితే క్లిక్ కాలేదు. ముఖ్యంగా మొదటి పాట జై బాలయ్య అయితే చాలా దారుణంగా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది.

అసలే ప్రభాస్ మారుతి కాంబినేషన్ పై ఒక రేంజ్ నెగిటివ్ టాక్ అయితే ఉంది. అసలు మారుతి సినిమా చేయవద్దు అని ప్రభాస్ ఫ్యాన్స్ గొడవ చేస్తున్నారు. ఇక ఈ తరుణంలో థమన్ పాటల పై కూడా కొంత ట్రోలింగ్ నడుస్తూ ఉండడంతో ప్రభాస్ ఆలోచనలో పడినట్లు అనిపిస్తుంది. ఒకవేళ వీర వీర సింహారెడ్డి సాంగ్స్ హై రేంజ్లో క్లిక్ అయి ఉంటే మాత్రం మరో ఆలోచన లేకుండా ఈ ఛాన్స్ దొరికేది.

కానీ థమన్ ఆ అద్భుత అవకాశాన్ని చేజేతులారా పోగొట్టుకున్నాడు. ఇంకాస్త ఫోకస్ చేసి జై బాలయ్య సాంగ్ అదరగొట్టి ఉంటే అతనికి ప్రభాస్ ఆఫర్ ఇచ్చేవాడు. ప్రస్తుతమైతే మారుతి టీమ్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి థమన్ ను నిజంగా తీసుకుంటారు లేదో చూడాలి.