Begin typing your search above and press return to search.

అతడి మ్యూజిక్ కు థమన్ వీరాభిమానంట..!

By:  Tupaki Desk   |   23 Oct 2022 10:04 AM IST
అతడి మ్యూజిక్ కు థమన్ వీరాభిమానంట..!
X
టాలీవుడ్లో కొన్నేళ్లుగా థమన్ హవా కొనసాగుతోంది. చిన్న, పెద్ద స్టార్స్ అనే తేడా లేకుండా థమన్ తనతో కలిసి పని చేసే దర్శక, నిర్మాతలకు అద్భుతమైన సంగీతం సమకూరుస్తున్నాడు. థమన్ కంపోజ్ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద వరుసగా బ్లాక్ బస్టర్ హిట్టు అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే థమన్ కు టాలీవుడ్లో ఫుల్ డిమాండ్ నెలకొంది.

అల్లు అర్జున్ తో 'అల వైకుంఠపురములో'.. బాలకృష్ణతో 'అఖండ', మహేష్ బాబుతో 'సర్కారువారిపాట', మెగాస్టార్ చిరంజీవితో రీసెంట్ గా 'గాడ్ ఫాదర్' మూవీతో సంగీతపరంగా థమన్ అలరించాడు. ముఖ్యంగా థమన్ బ్యాక్ గ్రౌండ్ (బీజీఎం) మ్యూజిక్ ఫ్యాన్స్ ని థియేటర్లలో హుర్రుతలూగిస్తోంది.

టాలీవుడ్ ను మ్యూజిక్ పరంగా శాసిస్తున్న థమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను తమిళ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజాకు వీరాభిమానిని అని చెప్పాడు. ఆయన అద్భుతమైన ప్రొగామర్ అని కితాబిచ్చాడు. తన ఆల్బమ్ లో కీబోర్డు ప్లే చేయాలని కోరిక ఉందని చెప్పాడు.

యువన్ శంకర్ రాజా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే తనకు బాధ కలుగుతుందన్నాడు. ఎప్పటికైన తనతో కలిసి పని చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు థమన్ తన మనసులోని మాటను వెల్లడించాడు. టాలీవుడ్లో థమన్ ఎలాగైతే నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడో అలాగే తమిళంలో యువన్ శంకర్ రాజా కొనసాగుతున్నాడు.

ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతుండటంతో త్వరలోనే వీరిద్దరి కలిసి పని చేసే అవకాశం ఉంది. అయితే అది ఎంత కాలానికి జరుగుతుందనేది మాత్రం దర్శక, నిర్మాతలపైనే ఆధారపడి ఉంటుంది. ఇకపోతే థమన్ మ్యూజిక్ అందించిన 'ప్రిన్స్' మూవీ తాజాగా విడుదలై పాజిటీవ్ టాక్ తో దూసుకెళుతోంది.

మరోవైపు థమన్ లిస్టులో తమిళ దర్శకుడు శంకర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబోలో రాబోతున్న 'RC15', సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోయే 'SSMB28' సినిమాలు ఉన్నాయి.