Begin typing your search above and press return to search.

థమన్ ఈ జోరుకు త్రివిక్రమ్‌ కారణం

By:  Tupaki Desk   |   24 July 2022 4:37 AM GMT
థమన్ ఈ జోరుకు త్రివిక్రమ్‌ కారణం
X
కాపీ క్యాట్‌ అనే విమర్శ నుండి జాతీయ అవార్డు సొంతం చేసుకునే వరకు సంగీత దర్శకుడు థమన్ జర్నీ సాగింది. ఈ జర్నీ లో ఆయన సాధించిన విజయాల కంటే విమర్శలు.. ట్రోల్స్ ఎక్కువ. ప్రతి సినిమాలో కూడా ఒకే తరహా పాటలు ఏంటి భయ్యా అంటూ చాలా మంది చాలా రకాలుగా చాలా సందర్భాల్లో విమర్శించిన దాఖలాలు ఉన్నాయి.

అలాంటి థమన్‌ ఎప్పుడైతే త్రివిక్రమ్‌ క్యాంప్ లో జాయిన్ అయ్యాడో అప్పుడే రాటు తేలాడు అన్నట్లుగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్రివిక్రమ్‌ తనకు కావాల్సిన ట్యూన్స్ ను థమన్ నుండి రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అరవింద సమేత సినిమాలోని పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్‌ చూసి నిజంగా ఈ సినిమా సంగీత దర్శకుడు థమన్‌ అయ్యి ఉంటాడా అనే అనుమానాలు వ్యక్తం చేసిన వారు ఉన్నారు.

అక్కడ నుండి తన ప్రతి సినిమాకు అంతకు మించి అన్నట్లుగా కష్టపడుతూ.. కొత్తదనం ను జనాలకు రుచి చూపించాడు. థమన్‌ ఈ స్థాయిలో సక్సెస్ లు అందుకోవడంతో పాటు అవార్డులను సైతం దక్కించుకోవడంలో ఖచ్చితంగా త్రివిక్రమ్‌ తో చేసిన వర్క్‌ ఎక్స్ పీరియన్స్ ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని చాలా మంది అంటున్నారు.

సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుని ఉన్న దేవి శ్రీ ప్రసాద్‌ ను ఢీ కొట్టడం అనేది చాలా కష్టం. అలాంటిది ఆయనకు పోటీగా.. ఒకానొక సమయంలో దేవి ని మించి అన్నట్లుగా థమన్ జోరు సాగింది.. సాగుతూనే ఉంది. అందుకే థమన్‌ ఇప్పుడు టాలీవుడ్‌ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా పాపులర్‌ మ్యూజిక్ డైరెక్టర్ గా నిలిచాడు.

అఖండ సినిమా యొక్క బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ ఏ స్థాయిలో బాక్స్ లను బద్దలు కొట్టిందో అందరికి తెల్సిందే. అందుకే రాధేశ్యామ్‌ వంటి భారీ సినిమా యొక్క బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ ను థమన్ తో చేయించిన విషయం తెల్సిందే. మొత్తానికి థమన్‌ కి తాజాగా వచ్చిన ఈ జాతీయ అవార్డు బాధ్యత ను మరింతగా పెంచడం ఖాయం.. ఆయన నుండి మరిన్ని బాక్స్ బద్దలు మ్యూజిక్‌ ఆల్బమ్స్ రీ రికార్డింగ్స్ రావడం ఖాయం అంటూ అభిమానులు అంటున్నారు.