Begin typing your search above and press return to search.

AA19: ఎగ్జైటింగ్ అప్డేట్స్ అంటున్న థమన్

By:  Tupaki Desk   |   2 Aug 2019 11:30 AM GMT
AA19: ఎగ్జైటింగ్ అప్డేట్స్ అంటున్న థమన్
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం AA19.ఇంకా సినిమాకు టైటిల్ ను అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి AA19 అనే పిలుచుకుంటున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడనే సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమానుండి అప్డేట్ రానుంది అంటూ థమన్ ఒక ట్వీట్ చేసి అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు.

ట్విట్టర్ ద్వారా థమన్ రెండు ఫోటోలను పోస్ట్ చేస్తూ "కెప్టెన్ కూల్ త్రివిక్రమ్ సర్.. మా వైస్ కెప్టెన్ పీఎస్ వినోద్ గారు. # AA19 ఎగ్జైటింగ్ అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి. @అల్లు అర్జున్" అంటూ ట్వీట్ చేశాడు. థమన్ భయ్యా షేర్ చేసిన ఫోటోలలో త్రివిక్రమ్.. పీఎస్ వినోద్ ఉన్నారు. AA19 షూటింగ్ ప్రస్తుతం కాకినాడలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఫోటోల నేపథ్యంలో సముద్రం.. పోర్ట్ కనిపిస్తూ ఉన్నాయి.

ఫోటోలు సరేగానీ AA19 టీమ్ నుండి ఏం అప్డేట్స్ రానున్నాయో అని అభిమానుల్లో ఇప్పటికే చర్చ మొదలైంది. టైటిల్ ప్రకటిస్తారని కొందరు.. ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్ ఒకేసారి వస్తాయని మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. మరి ఆ ఎగ్జైటింగ్ అప్డేట్స్ ఏమై ఉంటాయబ్బా?? ఈ థమన్ భయ్యా ఒకడు.. అప్డేట్ ఏంటో చెప్పకుండా సస్పెన్స్ పెంచడం ఎందుకో!