Begin typing your search above and press return to search.
ప్రముఖ సంగీత దర్శకుడికి గుండెపోటు
By: Tupaki Desk | 6 Jun 2020 10:30 AM ISTప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు శశిప్రీతమ్ గుండెపోటుకు గురయ్యారు. గురువారం ఉదయం తీవ్రమైన గుండెనొప్పి రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
శశి ప్రీతమ్ వాల్వులు మూసుకుపోవడంతో వైద్యులు వెంటనే ఆయనకు స్టంట్స్ వేసి ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం శశిప్రీతమ్ ఐసీయూలో కోలుకుంటున్నారు.
అప్పట్లో తెలుగులో వచ్చిన జేడీ చక్రవర్తి సినిమా ‘గులాబీ’కి సంచలన సంగీతం అందించింది ఇదే శశి ప్రీతమ్. గులాబీ, సముద్రం, రాఘవ వంటి చిత్రాలతో తెలుగులో ప్రముఖ సంగీత దర్శకుడిగా అవతరించాడు. సౌండ్ రికార్డింగ్, రిథమ్, ట్యూన్ రికార్డింగ్ లో ఈయన దిట్ట.
ప్రస్తుత టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఉన్న తమన్, చక్రి, అనూప్ రూబెన్స్ లు శశిప్రీతమ్ దగ్గర పనిచేసిన వారే. టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతోపాటు టీవీ సీరియల్స్ కు శశిప్రీతమ్ సంగీతాన్ని అందించారు.