Begin typing your search above and press return to search.
ఖైదీ నెంబర్ 150 సీక్వేల్ కావాలట
By: Tupaki Desk | 19 Sept 2017 5:26 PM ISTటాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ వినూత్నంగా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలను తీసేవారు కొందరే ఉన్నారని చెప్పాలి. వారిలో పవర్ స్టార్ ఒకరు. అలాగే చాలావరకు హీరోలు సీనియర్ దర్శకులతో గాని సక్సెస్ రేట్ ఉన్న దర్శకులతో గాని సినిమాలు చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలా కాదు సీనియర్-సక్సెస్ దర్శకుల దగ్గరికి వెళ్లకుండా చాలా వరకు ఒక్క హిట్ కొట్టిన దర్శకులతోనే సినిమాలను ఒకే చేస్తారు.
ఆయనతో ఎప్పటి నుంచో కొందరు సీనియర్ దర్శకులు సినిమా చెయ్యాలని చాలా వరకు ప్రయత్నించారు. కానీ వారికెవ్వరికి దక్కని అదృష్టం కొంతమంది యువ దర్శకులకు దక్కింది. అయితే ఇదే తరహాలో దర్శకుడు మురగదాస్ కూడా పవన్ కళ్యాణ్ తో సినిమాను చెయ్యాలని చాలా ట్రై చేశారట. ముఖ్యంగా గజినీ తమిళ్ లో హిట్ అయిన తర్వాత పవన్ తో చేద్దామనుకున్నారట కానీ అప్పుడు కూడా పవన్ ఒకే చెయ్యలేదు. ఇక ఆ కథ మహేష్ దగ్గరికి వెళ్లినా ఒకే కాలేదు. అయితే మురగదాస్ రీసెంట్ గా మరొకసారి పవన్ ని కలిశారట. పవన్ ఈ సారి ఖైదీ నెంబర్ 150 కి సీక్వెల్ వంటి సినిమా చేద్దామని అడిగారట.
తమిళ్ లో కత్తి గా తెరకెక్కిన ఆ సినిమాను మొదట చూసిన పవన్ చాలా బావుందని అప్పుడే ప్రశంసించారట. పవన్ కి సామజిక నేపథ్యంలో ఉండే కథలని ఎక్కువగా ఇష్టపడతారని అందుకే ఆ కథని పొడిగించమని చెప్పినట్లు మురగదాస్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 25వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక మురగదాస్- మహేష్ స్పైడర్ ఈ నెల 27న రిలీజ్ కానుంది. మరి మురగదాస్ పవన్ కోసం కథను ఎప్పుడు రెడీ చేస్తాడో చూడాలి.