Begin typing your search above and press return to search.

చిరు సినిమాకు భయపడ్డా!!

By:  Tupaki Desk   |   27 Sept 2017 4:56 PM IST
చిరు సినిమాకు భయపడ్డా!!
X
సోషల్ ఎలిమెంట్స్ తో సినిమాలను తెరకెక్కించి బాక్స్ ఆఫీస్ హిట్స్ ను అందుకునే దర్శకుల్లో ఏర్. మురగదాస్ ఒకరు. కంటెంట్ ఏదైనా ఈ దర్శకుడు ప్రేక్షకుల ఉహలకందే లాగా సినిమాను తీస్తాడు. ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్త తరహా కథాంశం ఉంటుంది. కథానాయకులను సూపర్ హీరోల లెవెల్ లో చూపించే విధానం ఆయన దర్శకత్వ ప్రతిభ. గజినీ - రమణ వంటి హిట్స్ తీసిన తర్వాత ఈ హీరోకి మెగా స్టార్ నుంచి పిలుపు వచ్చింది. స్టాలిన్ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు. అందుకు కారణం తన భయమేనని మురగదాస్ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. స్టాలిన్ సినిమా గురించి మాట్లాడుతూ.. చిరు నుంచి పిలుపు వచ్చినపుడు స్టాలిన్ కథ చెప్పగానే చాలా ఆనందపడ్డారు. నేను అప్పటికి మూడు సినిమాలను మాత్రమే తెరకెక్కించాను. అంత పెద్ద స్టార్ తో సినిమా తీస్తున్నానని అనే సరికి కొంచెం బయమేసింది. అంతే కాకుండా అప్పుడు ఆయన వయసులో నాకంటే పెద్దవారు. ఆనుభవం గలవారు. నాకు అప్పుడు ఎక్కువగా అనుభం లేదు. దీంతో ఆయనను సరిగ్గా డీల్ చేయలేకపోయాను. సినిమా మీద ఆ ప్రభావం కనిపించిందని చెప్పాడు.

ఇక మహేష్ గురించి చెబుతూ.. స్పైడర్ సినిమా స్టార్ట్ చేయకముందు నుంచే మహేష్ తో చాలా క్లోజ్ అయ్యాను. అంతే కాకుండా ఇప్పుడు నాకు అనుభవం కూడా పెరిగింది. మహేష్ కూడా తన వయసుకు సమానమే అని వివరిస్తూ.. స్పైడర్ సినిమా తీసేటప్పుడు ఎటువంటి ఒత్తిడికి లోనవ్వలేదని మహేష్ తాను సమన్వయంతో పని చేశామని మురగదాస్ చెప్పాడు.