Begin typing your search above and press return to search.

రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ...!

By:  Tupaki Desk   |   18 Dec 2018 7:02 AM GMT
రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ...!
X
సౌత్‌ లో స్టార్‌ దర్శకులైన రాజమౌళి- శంకర్‌- మణిరత్నం ల సరసన నిలబడే సత్తా ఉన్న దర్శకుడు మురుగదాస్‌. ఈయన కెరీర్‌ లో ఒకటి రెండు సినిమాలు మినహా అన్ని కూడా బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలే. మురుగదాస్‌ తాజా చిత్రం ‘సర్కార్‌’ యావరేజ్‌ టాక్‌ ను దక్కించుకున్నా ఏ స్థాయిలో వసూళ్లను రాబట్టిందో ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు. అంతటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత మురుగదాస్‌ చేయబోతున్న సినిమా పై ఆసక్తి నెలకొంది. మురుగదాస్‌ ట్రాక్‌ రికార్డు నేపథ్యం లో రజినీకాంత్‌ ఈయన తో ఒక చిత్రాన్ని చేయాలనుకుంటున్నాడు. ఆ తర్వాత అజిత్‌ హీరో గా మురుగ ఒక సినిమాను చేయబోతున్నాడట.

రజినీకాంత్‌ మూవీ అతి త్వరలోనే పట్టాలెక్కబోతుంది. వచ్చే ఏడాదిలోనే సినిమా విడుదల కాబోతుంది. రజినీకాంత్‌ తర్వాత చేయబోతున్న సినిమా విషయం లో మురుగదాస్‌ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాడట. తాజా గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అజిత్‌ కోసం తాను ఒక కథ సిద్దం చేశానని, అయితే రజినీకాంత్‌ తో మూవీ వల్ల ఆ ప్రాజెక్ట్‌ పక్కకు పెట్టినట్లుగా చెప్పుకొచ్చాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది చివర్లో అజిత్‌ తో మూవీని ప్రారంభించి 2020లో ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నాడు.

మురుగదాస్‌ దర్శకుడిగా 2000వ సంవత్సరంలో పరిచయం అయ్యింది అజిత్‌ మూవీ ‘దీన’తోనే. ఆ సినిమా ఆకట్టుకోలేక పోయినా కూడా ఆ తర్వాత ఆయన స్థాయి అమాంతం పెరిగింది. తన కు ఛాన్స్‌ ఇచ్చిన హీరో అజిత్‌ తో మూవీ చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నప్పటికి ఏదో ఒక కారణం వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అజిత్‌ తో మూవీ చేయబోతున్నాడు. ఇప్పటి నుండి అజిత్‌ అభిమానులు ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.