Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ తో మురుగదాస్ మాట్లాడాడు కానీ..

By:  Tupaki Desk   |   27 Sept 2017 9:42 AM IST
ప్రభాస్‌ తో మురుగదాస్ మాట్లాడాడు కానీ..
X
‘స్పైడర్’ తర్వాత మురుగదాస్ సినిమా ఏదనే విషయంలో రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. ఓవైపు తనతో తుపాకి.. కత్తి సినిమాలు చేసిన విజయ్ తోనే మురుగదాస్ పని చేయబోతున్నాడని.. మరోవైపు రజినీకాంత్ హీరోగా సినిమా చేసే అవకాశముందని అంటున్నారు. ఈ మధ్య మన ‘బాహుబలి’ ప్రభాస్ తోనూ మురుగదాస్ ఉండొచ్చన్న ప్రచారం కూడా జరిగింది. ఈ విషయమై మురుగాస్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రభాస్ తాను ఈ మధ్య మాట్లాడిన మాట వాస్తవమే అని.. ఐతే అందులో సినిమా కథ గురించి ఏమీ చర్చ జరగలేదని మురుగదాస్ స్పష్టం చేశాడు. ‘‘ప్రభాస్ కు ఫోన్ చేశాను. మేమిద్దరం మామూలుగా మాట్లాడుకున్నాం. కానీ మా చర్చల్లో ఏ కథ గురించి ఏమీ చర్చ రాలేదు’’ అన్నాడు మురుగ. అంతే తప్ప తామిద్దరం కలిసి సినిమా చేస్తామా.. లేదా అన్నది స్పష్టం చేయలేదు.

ఇక రజినీకాంత్ తో సినిమా విషయమై స్పందిస్తూ.. ‘‘ఆయనతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయి. రెండు మూడు కథలు అనుకున్నాం కూడా. కానీ అవి సఫలం కాలేదు. ఆయనతో భవిష్యత్తులో సినిమా చేసే అవకాశముంది’’ అని మురుగదాస్ చెప్పాడు. ఇక తన తర్వాతి సినిమా గురించి ఈ ప్రెస్ మీట్లో స్పందించకపోయినప్పటికీ.. మురుగదాస్ ఇంతకుముందే ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు. తుపాకి.. కత్తి చిత్రాల తర్వాత విజయ్ తో మూడోసారి జత కట్టబోతున్నట్లు స్పష్టం చేశాడు. తమ కాంబినేషన్లో రాబోయే తర్వాతి సినిమా కూడా చాలా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటానని.. ఆ సినిమా ఆరంభం కావడానికి కొంచెం సమయం పట్టొచ్చని అన్నాడు.