Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్ పై ఎందుకంత కోపం అంటే..వర్మ సమాధానం
By: Tupaki Desk | 24 July 2020 11:15 AM ISTవివాదాస్పద రాంగోపాల్ వర్మ హైదరాబాద్ కార్యాలయంపై నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ అభిమానులు దాడి చేసి నానా బీభత్సం సృష్టించారు. ఈ నేపథ్యంలోనే ఓ మీడియాతో మాట్లాడిన వర్మ హాట్ కామెంట్స్ చేశారు.
నిజానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటూ వాళ్లే తమ ఆర్జీవీ కంపెనీ కార్యాలయంకు వచ్చి వాళ్లే కొట్టుకున్నారని.. తాము కొట్టామని ప్రచారం చేసుకుంటున్నారని రాంగోపాల్ వర్మ మీడియాకు తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంత కోపం అన్న ప్రశ్నకు వర్మ ఆసక్తికరంగా స్పందించాడు. అసలు పవన్ కళ్యాణ్ పై తనకెలాంటి కోపం పగ ద్వేశం లేదని.. పవన్ కు నాకంటే పెద్ద ఫ్యాన్ ఎవడూ లేడని వర్మ క్లారిటీ ఇచ్చారు.
తనపై ‘పరాన్నజీవి’ సినిమా తీస్తూ ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారని.. తాను బ్లాక్ లో టికెట్ కొని మరీ ఈ సినిమాను చూస్తానని తెలిపారు.
ఇక తనకు మెగా ఫ్యామిలీ, పవన్ పై ఏమాత్రం కోపం లేదని.. పాపులర్ వ్యక్తుల జీవితాల్లోకి వెళ్లడం లేదని.. పబ్లిక్ డొమైన్ లో జరిగేదే తాను తీస్తున్నానని వివరించారు.
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో రష్యాన్ భార్య.. ఫుణే నుంచి ఫోన్ రావడం.. ట్రైలర్ లో చూపించడం న్యాయమా అన్న ప్రశ్నకు వర్మ స్పందించాడు. ఫుణే నుంచి ఫోన్ వస్తే వాళ్లే చేసినట్టా? అన్ని మీరూ ఊహించుకోకండని.. సినిమాలో పవన్ కళ్యాణ్ నుంచి పూర్తిగా నెగెటివ్ గా ఉందని మీరెలా గెస్ చేస్తారని ప్రశ్నించారు. మొత్తం చూశాక పవన్ కు పాజిటివ్ గా ఉండొచ్చు కదా అని వర్మ సమాధానమిచ్చారు. చూడకుండానే తన సినిమాపై నిందలు వేయవద్దని వర్మ సూచించారు.