Begin typing your search above and press return to search.

హత్యచేసిన హీరోయిన్..?

By:  Tupaki Desk   |   28 March 2021 5:00 AM IST
హత్యచేసిన హీరోయిన్..?
X
బాలీవుడ్ లో మంచి హైప్ తో రిలీజ్ కాబోతున్న చిత్రం ‘కోయి జానే నా’. కునాల్ కపూర్, అమైరా దస్తర్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీని అమిన్ హా‌జీ తెర‌కెక్కించారు. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్ర‌మోష‌న్ ఓ రేంజ్ లో సాగుతోంది.

ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ స్టార్ అమీర్ ఖాన్ స్పెష‌ల్ సాంగ్ లో దుమ్ములేపారు. దీంతో.. భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఖాన్ త్ర‌యంలోని మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్.. ఐట‌మ్ నంబ‌ర్ లో క‌నిపించ‌బోతుండ‌డంతో అంచ‌నాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ పాట‌లో ఎల్లీ అవ్ర‌మ్ తో చిందేశారు అమీర్‌.

ఈ మూవీ ఏప్రిల్ 2న విడుద‌ల కాబోతుండ‌డంతో.. ప్ర‌మోష‌న్ లో స్పీడ్ పెంచింది యూనిట్‌. త‌న మిత్రుడు, చిత్ర ద‌ర్శ‌కుడు అమిన్ హా‌జీ కోసం స్పెష‌ల్ సాంగ్ లో కనిపించిన అమీర్.. ప్ర‌మోష‌న్లో కూడా ఓ చెయ్యి వేశారు. త‌న మిత్రుడి కోరిక మేర‌కు అంటూ.. ఎల్లీ అవ్ర‌మ్ తో క‌లిసి డ్యాన్స్ చేసిన పిక్ ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పిక్ వైరల్ అవుతోంది.

ఇక‌, ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇందులో అమైరా ద‌స్త‌ర్ హంతకురాలిగా క‌నిపించ‌బోతోంద‌ని స‌మాచారం. స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా రాబోతున్న ఈ మూవీలో ఇదే కీ పాయింట్‌ అని తెలుస్తోంది. మ‌రి, ఈ థ్రిల్ల‌ర్ ను ఆడియ‌న్స్ ఎలా రిసీవ్ చేసుకుంటార‌న్న‌ది చూడాలి.