Begin typing your search above and press return to search.

మురారివా వీడియో : కీర్తి కుమ్మేసింది, ఆ లైన్‌ లో పడ్డట్లే!

By:  Tupaki Desk   |   7 Jun 2022 9:31 AM GMT
మురారివా వీడియో : కీర్తి కుమ్మేసింది, ఆ లైన్‌ లో పడ్డట్లే!
X
సూపర్ స్టార్‌ మహేష్ బాబు.. కీర్తి సురేష్ ల సర్కారు వారి పాట విడుదల అయిన మూడు వారాల తర్వాత మురారివా అంటూ కొత్త పాటను యాడ్ చేయడం జరిగింది. యూట్యూబ్‌ లో కూడా విడుదల చేయకుండా కేవలం థియేటర్‌ లోనే మురారివా అనే పాటను యాడ్‌ చేశారు. మహేష్ బాబు చాలా మురిపించిన మురారివా పాట ను చూడాలంటే థియేటర్ కు వెళ్లాల్సిందే అనడంలో చాలా మంది అభిమానులు పాట కోసం థియేటర్‌ కు క్యూ కట్టారు.

థియేటర్ లో యాడ్‌ చేసిన కొన్ని రోజులకు యూట్యూబ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు మురారివా పాటను తీసుకు వచ్చారు. మహేష్ బాబు మరియు కీర్తి సురేష్‌ ల కాంబోలో ఉన్న ఈ పాట ఆకట్టుకునే విధంగా ఉంది. అందంగా చిత్రీకరించడంతో పాటు పాటలో హీరో మరియు హీరోయిన్ ను చక్కగా చూపించడంలో దర్శకుడు పరశురామ్‌ సక్సెస్ అయ్యాడు. పూర్తి ఇండోర్ భారీ సెట్టింగ్స్ లో రూపొందిన ఈ పాట కోసం భారీగానే ఖర్చు చేసినట్లుగా అనిపిస్తుంది.

ఇంతగా ఖర్చు చేశారు కనుకే సినిమా నుండి ఆ పాటను తొలగించినా మళ్లీ యాడ్‌ చేశారు. యూట్యూబ్‌ లో ఈ పాట ఖచ్చితంగా ట్రెండ్‌ అవ్వడం ఖాయం. ఇక ఈ పాట ప్రత్యేకత ఏంటీ అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా కీర్తి సురేష్ ఈ పాటలో స్కిన్‌ షో చేసింది. కెరీర్‌ ఆరంభం నుండి కూడా పూర్తిగా కవర్ చేసుకుంటూ కనిపించి నటించిన కీర్తి సురేష్ ఈ సినిమా విషయంలో కాస్త తన లిమిట్స్ ను క్రాస్ చేసింది.

కమర్షియల్‌ హీరోయిన్‌ అంటే కనీసం నడుము.. థైస్ చూపించకుంటే మనుగడ సాధ్యం కాదు అనుకుందో ఏమో కాని మురారివా పాటలో నడుము అందాలతో కీర్తి సురేష్ మొదటి సారి ఆకట్టుకుంది. నాభి కనిపించకుండా నడుము అందాలతో వావ్‌ అనిపించింది. క్లీ వేజ్‌ షో తో పాటు థైస్ ను కూడా కనిపించి కనిపించకుండా చూపించి మ్యానేజ్ చేసింది.

మొత్తానికి ఇప్పటి వరకు ఎప్పుడు చూపించని అందాన్ని కీర్తి సురేష్ చూపించి కుమ్మేసింది. స్కిన్ సో చేసే హీరోయిన్స్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వారి జాబితాలో కీర్తి సురేష్ కూడా ఈ సినిమా తో ఈ పాటతో చేరినట్లు అయ్యింది. కీర్తి సురేష్ ముందు ముందు కూడా ఈ స్థాయి స్కిన్‌ షో చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఎబ్బెట్టుగా ఉండకుండా ఇలా లిమిటెడ్‌ స్కిన్‌ షో తో కీర్తి సురేష్ మరింత అందంగా కనిపిస్తుందని.. కమర్షియల్‌ సినిమాలకు ముఖ్యంగా తెలుగు సినిమాలకు ఈమాత్రం అయినా స్కిన్‌ షో తప్పనిసరి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. పాటలో మహేష్‌ బాబుకు సరి జోడీ అన్నట్లుగా పోటీ పడి మురారివా పాటలో కూడా కీర్తి సురేష్‌ డాన్స్ తో ఇరగదీసింది. మమ మహేష మరియు మురారివా పాటలతో మాస్ కు మరింతగా సర్కారు వారి పాట దగ్గర అయ్యింది అనడంలో సందేహం లేదు. కీర్తి సురేష్ కూడా ఈ సినిమా తో కొత్త జర్నీ స్టార్ట్‌ చేసినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.