Begin typing your search above and press return to search.
'ముంబై సాగా' టీజర్: బాంబేలో వైలెన్స్ రాజ్యమేలుతున్న టైంలో..!
By: Tupaki Desk | 24 Feb 2021 4:00 PM ISTబాలీవుడ్ స్టార్స్ ఇమ్రాన్ హష్మి - జాన్ అబ్రహం - సునీల్ శెట్టి ప్రధాన పాత్రలతో రూపొందిన క్రైమ్ డ్రామా ''ముంబై సాగా". ఇందులో కాజల్ అగర్వాల్ కీలక పాత్ర పోషించింది. సంజయ్ గుప్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మార్చి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
'బాంబే ఇంకా ముంబైగా మారకముందు.. వైలెన్స్ బాంబే వీధుల్లో రాజ్యమేలుతున్నప్పుడు' అంటూ ఈ టీజర్ ప్రారంభమైంది. బాంబేలో అండర్ వరల్డ్ హవా నడిచిన సమయంలో ఈ సినిమా రూపొందించినట్లు అర్థం అవుతోంది. ఇందులో బాంబేని ఏలాలనుకునే అమర్త్యరావు అనే భయంకరమైన గ్యాంగ్ స్టర్ పాత్రలో జాన్ అబ్రహం కనిపిస్తున్నాడు. సిస్టమ్ కి ఎదురుగా వెళ్తున్న అతనికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించే స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇమ్రాన్ హష్మి కనిపిస్తున్నాడు.
బాంబేని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూసే గ్యాంగ్ స్టర్ కు అండర్ వరల్డ్ ని తుడిచిపెట్టాలనుకునే ఎన్కౌంటర్ స్పెసిలిస్ట్ మధ్య జరిగిన ఘర్షణను ప్రధానంగా తీసుకుని 'ముంబై సాగా' సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 'ముంబై సాగా' టీజర్ లో కాజల్ అగర్వాల్ పాత్రని మాత్రం చూపించలేదు. ఈ యాక్షన్ ప్యాకెడ్ టీజర్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ తో పాటు మంచి విజువల్స్ తో ఆకట్టుకుంటుంది. అయితే ఈ బీజీఎం అప్పుడెప్పుడో తెలుగులో వచ్చిన 'గోవిందా గోవిందా' సినిమాలోని ట్యూన్ ని పోలివుండటం గమనార్హం. ఈ క్రైమ్ థ్రిల్లర్ ని టి-సిరీస్ మరియు వైట్ ఫెదర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్ - కిషన్ కుమార్ - అనురాధ గుప్తా - సంగీత అహిర్ నిర్మిస్తున్నారు.