Begin typing your search above and press return to search.

ముంబయ్ ఏజన్సీలను దించేస్తున్నారుగా

By:  Tupaki Desk   |   13 July 2016 11:55 AM GMT
ముంబయ్ ఏజన్సీలను దించేస్తున్నారుగా
X
ఇప్పటివరకు బాహుబలి సినిమా మొదటి భాగం రిలీజయ్యాక.. ఒక్కటంటే ఒక్క తెలుగు ఛానల్ కు కూడా రాజమౌళి ఒక్క ప్రత్యేక ఇంటర్యూ కూడా ఇవ్వలేదు. కాని నేషనల్‌ అవార్డును అందుకోగానే మనోడు ఒక నేషనల్ ఛానల్ కు ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చాడు. ఇప్పటివరకు లేని హైప్.. సడన్ గా ''ధృవ'' సినిమా చుట్టూ ఎక్కువైంది. పైగా రామ్‌ చరణ్‌ డైట్ గురించి.. పెట్స్ గురించి.. తదుపరి సినిమాల గురించి కూడా బజ్‌ పెరిగింది. అసలు బయటెక్కడా ఒక్క ట్వీటు కూడా వేయలేదు కాని.. హీరో రానా శ్రీకాకుళంకు చెందిన ఒక లెజండరీ వ్రెజ్లర్ జీవిత చరిత్రను సినిమాతీసే యోచనలో ఉన్నాడని ఒక వార్తాపత్రికలో ఏకంగా బ్యానర్ ఐటెం వచ్చేసింది. ఇవన్నీ ఎలా పాజిబుల్‌ అని ఎప్పుడైనా ఆలోచించారా?

నిజానికి ఇవన్నీ ఈ సెలబ్రిటీలకు సంబంధించిన పి.ఆర్.ఏజన్సీలు చేస్తున్న పనులు. బాహుబలి సినిమాను ఓ రేంజులో ప్రమోట్ చేయాలంటే.. ఖచ్చితంగా ఒక ముంబయ్‌ కు చెందిన పిఆర్ ఏజన్సీ అవసరమని ఫీలైన రాజమౌళి.. అప్పట్లో ఒకరిని హైర్‌ చేసుకున్నాడు. ఇప్పుడు వారే రాజమౌళి ఖాతాను కూడా చూస్తున్నారు. సో.. ఎప్పుడూ నేషనల్ లెవెల్లో రాజమౌళి వార్తల్లోనే ఉంటాడు. అలాగే రానా కూడా బాలీవుడ్‌ పిఆర్ ఏజన్సీని ఎప్పుడో పెట్టుకున్నాడు. అందుకే ఇలా అస్తమానం న్యూస్ లోనే ఉంటాడు. ఇప్పుడిక రామ్‌ చరణ్‌ వంతొచ్చింది. తన స్నేహితుడు రానా సూచించాడేమో తెలియదు కాని.. ఇప్పుడు చెర్రీ వైఫ్‌ ఉపాసన లోకల్ పి.ఆర్.ఓ.లను తీసేసి.. చరణ్‌ కోసం ఒక ముంబయ్ ఏజన్సీ సేవలను తీసుకుంటోందట. అందుకే ఈ ట్రెండింగ్ అంతా.