Begin typing your search above and press return to search.

కంగన సోదరి రంగోలిని ముంబై పోలీసులు ఎందుకు పిలిచారు?

By:  Tupaki Desk   |   22 Oct 2020 10:15 AM IST
కంగన సోదరి రంగోలిని ముంబై పోలీసులు ఎందుకు పిలిచారు?
X

ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత క‌శ్మీర్ తో పోల్చిన తరువాత శివసేన వ‌ర్సెస్ కంగనా రనౌత్ ఎపిసోడ్స్ తెలిసిన‌దే. ఇరు వ‌ర్గాల‌ మధ్య యుద్ధం అంత‌కంత‌కు హీట్ పెంచింది. ముంబైలో నివసించేందుకు భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని కంగ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించింది. ర‌క‌ర‌కాల సీక్వెన్స్ ఘ‌ట‌న‌ల త‌ర్వాత‌ కంగనా రనౌత్ ముంబై నుండి బయలుదేరి గత నెలలో తిరిగి తన స్వస్థలమైన మనాలికి వెళ్ళారు.

ముంబైపై అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు కంగ‌న - రంగోలి సిస్ట‌ర్స్ పై దేశద్రోహ కేసు న‌మోదైంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. కంగన రనౌత్.. ఆమె సోదరిని ముంబై పోలీసులు ప్రశ్నించేందుకు సమన్లు పంపార‌ని ప్ర‌ముఖ జాతీయ మీడియా వెల్ల‌డించింది.

మిస్ రనౌత్.. రంగోలి చందేల్ ల‌ను అక్టోబర్ 26.. అక్టోబ‌ర్ 27 తేదీల్లో దర్యాప్తు అధికారి ముందు హాజరుపరచాలని స‌మ‌న్ల‌లో కోరారు. ముంబై మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి గత వారం వారికి వ్యతిరేకంగా మొదటి సమాచార నివేదిక (ఎఫ్‌.ఐ.ఆర్) నమోదైంది.

31 ఏళ్ల బాలీవుడ్ న‌టి కంగ‌న ముంబై పరువు తీయడంతో పాటు.. తన ట్వీట్ల ద్వారా ``మత విభేదాలను సృష్టిస్తున్నారని`` ఆరోపించిన కాస్టింగ్ డైరెక్టర్ పిటిషన్ ‌కు ప్రతిస్పందనగా.. దీనిపై సమగ్ర దర్యాప్తు అవసరమని కోర్టు తెలిపింది.

ఉల్లంఘనల పేరుతో ముంబై పౌర అధికారులు పోష్ హిల్స్ ప్రాంతంలోని కంగ‌న‌ రనౌత్ కార్యాలయాన్ని కూల్చివేయడంతో ఈ సీక్వెన్సుకు ఆజ్యం పోసిన్ట‌య్యింది. కూల్చివేత దాదాపుగా ముగిసిన తరువాత Ms రనౌత్ స్టే ఇచ్చి.. రూ.2 కోట్ల పరిహార దావా వేశారు. తన పిటిషన్లో కూల్చివేత ``మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను చేసిన వ్యాఖ్యల ప్రత్యక్ష ఫలితం`` అని పేర్కొంది.