Begin typing your search above and press return to search.

హృతిక్ రోష‌న్ కు ముంబై పోలీసుల స‌మ‌న్లు!

By:  Tupaki Desk   |   26 Feb 2021 2:00 PM IST
హృతిక్ రోష‌న్ కు ముంబై పోలీసుల స‌మ‌న్లు!
X
బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ కు ముంబై క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు స‌మ‌న్లు జారీచేశారు. గ‌తంలో న‌టి కంగ‌నా ర‌నౌత్ ఫిర్యాదు చేసిన ఈ-మెయిల్ కేసులో ఆయ‌నకు నోటీసులు పంపించారు. ఫిబ్ర‌వ‌రి 27న హృతిక్ వాంగ్మూలం తీసుకుంటామ‌ని పోలీసులు తెలిపారు.

న‌టి కంగ‌నా ఈ-మెయిల్ అకౌంట్ నుంచి త‌న‌కు బెదిరింపు మెయిల్స్ వ‌చ్చాయ‌ని 2016లో హృతిక్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో.. వీరిద్ద‌రి మ‌ధ్య వివాదం త‌లెత్తింది. ఆ త‌ర్వాత కంగ‌నా కూడా హృతిక్ పై కంప్లైంట్ ఇచ్చింది. అయితే.. స‌ద‌రు ఈ-మెయిల్ ఐడీని రోషనే తనకు అందించాడని, 2014 వరకు తాము అదే మెయిల్ ఐడీ ద్వారా కమ్యూనికేట్ చేసుకున్నామని పోలీసుల‌కు తెలిపింది.

ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా 2016 లో సైబర్ సెల్ దర్యాప్తు బృందం హృతిక్ రోషన్ ల్యాప్‌టాప్, ఫోన్‌ కూడా తీసుకుంది. అయితే.. 2020 డిసెంబర్‌లో హృతిక్ న్యాయవాది అభ్యర్థన మేరకు ఈ కేసును సీఐయుకు బదిలీ చేశారు. కాగా.. వీరిద్ద‌రూ కలిసి ప‌లు సినిమాల్లో న‌టించారు. 2010లో కైట్స్ మూవీలో జోడీగా క‌నిపించారు హృతిక్‌-కంగ‌నా. ఆ త‌ర్వాత 2013లో వ‌చ్చిన క్రిష్- 3 మూవీలోనూ వీరిద్ద‌రూ క‌లిసి న‌టించారు.