Begin typing your search above and press return to search.

గంజాయ్ ఇష్యూ..హీరోకు పోలీసుల వార్నింగ్

By:  Tupaki Desk   |   16 Sept 2018 4:12 PM IST
గంజాయ్ ఇష్యూ..హీరోకు పోలీసుల వార్నింగ్
X
బాలీవుడ్ హీరో - ధూమ్ సినిమాల్లో బైక్ పై స్టంట్ తో అలరించిన ఉదయ్ చోప్రా గంజాయ్ ను చట్టబద్దం చేయాలంటూ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే.. కొందరు దీనికి మద్దతు తెలుపగా.. చాలా మంది మాత్రం చట్టబద్దతతో యువత మత్తులో జోగుతారని.. దీని వల్ల దేశంలో దుష్పరిణామాలు తప్పవని ఉదయ్ ను వ్యతిరేకించారు. ఎవరూ ఎలాంటి విమర్శలు చేసినా కానీ ఉదయ్ చోప్రా మాత్రం గంజాయ్ పై తన అభిప్రాయాలను వెనక్కి తీసుకోలేదు.

ఉదయ్ చోప్రా గంజాయ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. దీనిపై తాజాగా ముంబై పోలీసులు ఈ బాలీవుడ్ హీరోకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. భారతీయ పౌరుడిగా మీకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉందని. కానీ గంజాయ్ నిషేధించబడిన మత్తుపదార్థం.. అది ఎవరి వద్ద ఉన్నా జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సిందేనంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు.. నార్కోటిక్ డ్రగ్స్ - సైకోట్రోపిక్ పదార్థాల చట్టం 1985 ప్రకారం శిక్షార్హులని.. ఈ విషయం అందరికీ చెప్పండని ఉదయ్ చోప్రా కు ముంబై పోలీసులు సూచించడం విశేషం.