Begin typing your search above and press return to search.

#సుశాంత్.. మా ద‌ర్యాప్తు స‌రైన‌దేన‌ని తేలిందన్న ముంబై పోలీస్

By:  Tupaki Desk   |   4 Oct 2020 9:15 AM IST
#సుశాంత్.. మా ద‌ర్యాప్తు స‌రైన‌దేన‌ని తేలిందన్న ముంబై పోలీస్
X
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ఒక్కో ట్విస్టు సినిమాటిక్ అప్పియ‌రెన్స్ తో వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది హ‌త్యా? ఆత్మ‌హ‌త్యా? అని తెలుసుకునేందుకు సీబీఐ బ‌రిలో దిగి ద‌ర్యాప్తును సాగిస్తోంది. ఇక ఈ కేసులో ప్ర‌ఖ్యాత ఎయిమ్స్ ఫోరెన్సిక్ రీపోస్ట్ మార్ట‌మ్ నిర్వ‌హించ‌డం తెలిసిన‌దే. అయితే ఇది హ‌త్య కాదు అంటూ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఖండించ‌డం త‌మ గెలుపు అని ముంబై పోలీసులు ప్ర‌క‌టించారు. త‌మ దర్యాప్తులో చిత్త‌శుద్ధి నిరూపిత‌మైందని నగర పోలీసు కమిషనర్ పరమ్ బిర్ సింగ్ శనివారం తెలిపారు.

దర్యాప్తు గురించి ఏమీ తెలియకుండానే `స్వార్థ ప్రయోజనాలు` ఉన్న కొందరు ముంబై పోలీసులను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన జాతీయ మీడియాతో అన్నారు. రాజ్ ‌పుత్ ఆత్మహత్య చేసుకున్నార‌ని.. ఇది హత్య కాదని ఎయిమ్స్ వైద్య బోర్డు శనివారం పేర్కొంది. ఈ వార్తలపై స్పందించిన పోలీస్ క‌మీష‌న‌ర్ సింగ్ నగర పోలీసుల దర్యాప్తు నిబ‌ద్ధ‌త‌తో సాగింద‌ని.. శవపరీక్ష నిర్వహించిన నగరంలోని కూపర్ ఆసుపత్రి వైద్యులు కూడా తమ పనిని పూర్తి శ్ర‌ద్ధ‌గా చేశారని చెప్పారు. `ఎయిమ్స్` ఫలితాల ద్వారా ప్ర‌తిదీ నిరూప‌ణ అయ్యింద‌ని తెలిపారు.

రాజ్ ‌పుత్ కేసులో బీహార్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌.ఐ.ఆర్ బదిలీని సుప్రీంకోర్టు సమర్థించింది. ముంబై పోలీసుల దర్యాప్తును కాదు. మా దర్యాప్తులో కోర్టు ఎటువంటి తప్పిదాన్ని కనుగొనలేదు అని అతను అన్నారు. నగర పోలీసులు దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్ ‌లో సుప్రీం కోర్టుకు సమర్పించారని తెలిపారు. జూన్ 14 న ముంబైలోని తన ఫ్లాట్ లో రాజ్ పుత్ (34) చనిపోయిన అనంత‌రం ర‌క‌ర‌కాల కోణాల్లో పోలీస్ ద‌ర్యాప్తు సాగిన సంగ‌తి తెలిసిన‌దే.