Begin typing your search above and press return to search.

మోడ‌ల్ పై అత్యాచారం.. రెండు తెలుగు పేర్లు కూడా!

By:  Tupaki Desk   |   1 Jun 2021 2:30 PM GMT
మోడ‌ల్ పై అత్యాచారం.. రెండు తెలుగు పేర్లు కూడా!
X
#మీటూ ఉద్య‌మ ప‌ర్య‌వ‌సానాన్ని ఇంకా ఎవ‌రూ మ‌రువ‌లేదు. ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాల్లో ఈ త‌ర‌హా వేధింపుల ఆరోప‌ణ‌లు చూస్తున్నవే. తాజాగా ముంబై బాంద్రా పోలీస్ స్టేష‌న్ లో ఈ త‌ర‌హా కేసు ఒక‌టి న‌మోదైంది. త‌న‌ని వేధించారంటూ 28 ఏళ్ల మోడ‌ల్ కం సాంగ్ రైట‌ర్ బాలీవుడ్ కి చెందిన‌ ప‌లువురు ప్ర‌ముఖుల‌పై లైంగిక వేధింపుల‌ కేసును న‌మోదు చేయ‌గా ముంబై బాంద్రా పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ న‌మోదు చేసి ద‌ర్యాప్తు సాగిస్తున్నారు.

ఇందులో ఓ తెలుగు హై ప్రొఫైల్ పేరు వినిపించ‌డం క‌ల‌క‌లం రేపింది. అయితే ఈ ఆరోప‌ణ‌ల్లో నిజానిజాలేమిట‌న్న‌ది పోలీసులే తేల్చాల్సి ఉంది. ఇది 2013 నుంచి 2019 మ‌ధ్య‌లో జ‌రిగిన ఘ‌ట‌న కావ‌డంతో ఇందులో నిజం ఎంత‌? అన్నది క్లారిటీ రావాల్సి ఉంటుంది.