Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ బ్రాండ్ వెనుక అసలు కథ!

By:  Tupaki Desk   |   19 July 2018 11:48 AM IST
విజయ్ దేవరకొండ బ్రాండ్ వెనుక అసలు కథ!
X
అర్జున్ రెడ్డి విడుదల తర్వాత సాలిడ్ గా ఇది నా సినిమా అని విజయ్ దేవరకొండ గర్వంగా చెప్పుకునే సినిమా ఒక్కటి కూడా రాలేదు. అప్పుడెప్పుడో ఐదేళ్ల క్రితం రావాల్సిన ఏ మంత్రం వేసావే అని ఒకటి విడుదల చేసారు.హీరోతో సహా దాన్ని ఎవరు పట్టించుకోలేదు కాబట్టి కౌంట్ లోకి రాదు. ఇక మహానటిలో చేసింది క్యామియో కానీ క్యామియో. అది బ్లాక్ బస్టర్ అయినా నెంబర్ యాడ్ అయ్యిందే తప్ప విజయ్ దేవరకొండకు పెద్దగా ఒరిగింది ఏమి లేదు. గీత గోవిందం రావడానికి ఇంకా నెల రోజుల టైం ఉంది. అంతకు ముందే టాక్సీ వాలా అన్నారు కానీ దాని గురించి ఎక్కడా చిన్న ఊసు కూడా లేదు.

ఇన్ని సందిగ్దతల మధ్య విజయ్ దేవరకొండ అనే బ్రాండ్ జనంలో బాగా నానుతూ ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. దీని వెనుక ముంబై బేస్డ్ టీమ్ ఒకటి విజయ్ దేవరకొండ  ప్రమోషన్ కోసమే పనిచేస్తోందని ఇన్ సైడ్ టాక్. తెలుగులో తనను ప్రమోట్ చేసేందుకు సరైన టీమ్ దొరకలేదో లేక తెలుగువాళ్ళ మీద నమ్మకం లేకనో మొత్తానికి విజయ్ దేవరకొండ ఇలా వేరే రాష్ట్రం వాళ్ళను తెచ్చుకోవడం విశేషమే. వీళ్ళ వల్లే ఫిలిం ఫేర్ అవార్డుని వేలం వేసి సిఎం చారిటీకి ఇచ్చేయడం-బర్త్ డే సందర్భంగా జంట నగరాల్లో ఫ్రీ ఐస్ క్రీమ్ పంచిపెట్టడం-అభిమానులను వ్యక్తిగతంగా పిలిపించుకుని వాళ్ళతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో వైరల్ చేయటం లాంటివి జరిగాయని తెలిసింది. అంతే కాదు సాంప్రదాయ తెలుగు హీరోల శైలికి భిన్నంగా రౌడీ అనే తన కాస్ట్యూమ్ బ్రాండ్ కోసం చొక్కా లేకుండా సల్మాన్ ఖాన్ తరహాలో సిక్స్ ప్యాక్ ఎక్స్ పోజ్ చేయిస్తూ  పోస్టర్స్ రిలీజ్ చేయటం కూడా ముంబై టీమ్ ప్లానేనట.

మొత్తానికి సినిమాలు విడుదల ఆలస్యం అవుతున్నా తన పేరు మాత్రం నానుతూ ఉండేలా విజయ్ దేవరకొండ వేసిన స్కెచ్ బాగానే వర్క్ అవుట్ అవుతోంది.  కానీ ఇవి ఎన్ని చేసినా సినిమాలు సినిమాలే. ఈవెంట్లు ఈవెంట్లే. వీటిని మర్చిపోవచ్చేమో కానీ సినిమా శాశ్వతం. అందుకే బోల్డ్ కంటెంట్ తో ఏ  మూవీ వచ్చినా అర్జున్ రెడ్డితో పోలిక వచ్చేస్తోంది. గీత గోవిందంతో ఫామిలీ ఆడియన్స్ కి పూర్తిగా దగ్గరవుతాను అనే ధీమాలో ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఫామిలీ ఎమోషన్స్ ని బాగా తెరకెక్కించే దర్శకుడు పరశురామ్ దీన్ని టేకప్ చేయడం దానికి కారణం. ఆగస్ట్ 15న విడుదల కానున్న గీత గోవిందం ప్రమోషన్ కోసం తన ముంబై టీమ్ తో కలిసి తన వంతుగా స్పెషల్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నాడట. అవెలా ఉండబోతున్నాయో.