Begin typing your search above and press return to search.
ఇప్పట్లో హైదరాబాద్ రామంటున్న ముంబై యాక్టర్లు!
By: Tupaki Desk | 16 Jun 2020 6:30 PM ISTటాలీవుడ్ ఇండస్ట్రీలో దేశ వ్యాప్తంగా సినీ ఇండస్ట్రీలో కరోనా భయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సామాన్యుల దగ్గర నుండి సెలబ్రిటీల వరకూ అందరూ ఇంటిపట్టునే ఉంటూ జాగ్రత్త పడుతున్నారు. అయితే ఇటీవలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సడలింపులు అమలు చేయడంతో జనాలకు సెలబ్రిటీలకు విచ్చలవిడిగా బయట తిరిగే అవకాశం లభించడంతో కరోనా వైరస్ కూడా అదే రేంజ్ లో వ్యాప్తి చెందుతూ వస్తోంది. ఇప్పటికే దేశంలో మూడు లక్షల పైగా కరోనా కేసులు నమోదు కావడంతో భయాందోళనలతో బతుకుతున్నారు. ఇక ఈ సినిమా షూటింగుల కోసం ఇంతకాలం పోరాడిన ఇండస్ట్రీ పెద్దలు ఇప్పుడు షూటింగ్ లకి రావడానికి జంకుతున్నారు. టాలీవుడ్ బాలీవుడ్ సినిమాలలో నటించే నటులు.. తెలంగాణ ప్రభుత్వం సినిమా షూటింగ్లకు పర్మిషన్ ఇవ్వడంతో అందరు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో సినిమా షూటింగ్ లు ప్రారంభిద్దాం అంటే కరోనా మహమ్మారి రోజు రోజుకి వేలల్లో వ్యాప్తి చెందుతూ భయపెడుతోంది.
అయితే ఇటీవలే తెలుగు ఇండస్ట్రీ సినిమాల షూటింగులు హైదరాబాద్ లోని కొన్ని చోట్ల ప్రారంభమయ్యాయి. కానీ ఎంతో సామాజిక దూరం పాటించిన కరోనా వస్తుందనే భయం మాత్రం నిర్మాతలను నటీనటులను పట్టిపీడిస్తోంది. నిజానికి బాలీవుడ్ నుండి టాలీవుడ్ సినిమాల కోసం హైదరాబాద్ వచ్చి నటించే నటులు ఎక్కువగా భయపడుతున్నారు. ఇక తెలుగు సినిమాలు షూటింగ్ స్టార్ట్ చేయడానికి మన నిర్మాతలు కూడా సిద్ధంగా లేమని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలు షూటింగ్ ప్రారంభించి నిలిపి వేయగా త్వరలో మొదలు కాబోతున్న సినిమాల షూటింగ్స్ మాత్రం ప్రారంభించమని నిర్మాతలు తెలియజేస్తున్నారు. అయితే ముంబై నుండి వచ్చే నటలు కూడా కరోనా ఉన్నంతకాలం హైదరాబాదులో అడుగు పెట్టలేమనీ నిర్మాతలతో డైరెక్టర్లతో చెప్పేస్తున్నారట. చూడాలి మరి సరైన సిబ్బంది లేకుండా తెలుగు సినిమా షూటింగులు ఎలా జరగనున్నాయో!