Begin typing your search above and press return to search.

కొత్త కాంబోలతో కొడుతున్నారుగా..

By:  Tupaki Desk   |   6 Jan 2018 3:30 AM GMT
కొత్త కాంబోలతో కొడుతున్నారుగా..
X
కాంబినేషన్ తోనే క్రేజ్ సృష్టించడం.. సినిమాల్లో ఎప్పటికీ ఎక్స్ పైరీ కాని ట్రెండ్. హీరో- హీరోయిన్.. హీరో-డైరెక్టర్.. హీరో-కంపోజర్.. ఇలా చాలానే కాంబినేషన్స్ కు క్రేజ్ ఉంటుంది. ఈ మధ్యనే మల్టీస్టారర్ ట్రెండ్ స్టార్ట్ అయ్యాక.. పలు సినిమాలు ఆసక్తి కలిగించాయి. కానీ ఇప్పుడు మాత్రం స్టార్ హీరోలు.. అసలు ఊహించడానికే కష్టం అనిపించే కాంబినేషన్స్ కు సై అనేస్తున్నారు.

ఎన్టీఆర్.. రామ్ చరణ్ కాంబినేషన్ ను ఎవరైనా గతంలో ఊహించారా? రాజమౌళి పుణ్యమా అని ఇది సుసాధ్యం అని తేలిపోయింది. బాహుబలి లాంటి సిరీస్ తర్వాత.. మల్టీస్టారర్ చేయడమే కరెక్ట్ అని ఫిక్స్ అయిన దర్శకధీరుడు అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. మహేష్ బాబు.. అల్లరి నరేష్ ల కాంబినేషన్ ను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో చూడచ్చని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. నాగార్జున- కార్తిలతో ఇప్పటికే ఓ చిత్రాన్ని రూపొందించిన ఎక్స్ పీరియన్స్ ఈ డైరెక్టర్ సొంతం. నితిన్- శర్వానంద్ లతో ఓ మూవీ చేసేందుకు సకలం సిద్ధం చేసుకుంటున్నాడు గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే మల్టీ స్టారర్ పై కూడా ఇప్పటికే క్లారిటీ ఉంది. వెంకటేష్ - వరుణ్ తేజ్ లు ఈ ఎఫ్2 మూవీలో నటించబోతున్నారు. నాగార్జున- నాని కాంబిషన్ లో కూడా ఓ మల్టీ స్టారర్ పై ప్రచారం జోరుగానే ఉంది. అల్లరి నరేష్ - సునీల్ కలిసి ఓ సినిమాలో అల్లరి చేసేందుకు రెడీ అయిపోతున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో మల్టీ స్టారర్ అంటే సమానంగ్ స్క్రీన్ టైం షేర్ చేసుకోవడం కాదని.. సినిమాను నడిపించే శక్తి సామర్ధ్యాలను కలిగి ఉండడం.. థియేటర్లకు జనాలను రప్పించే కంటెంట్ కలిగి ఉండడం అని చెప్పేస్తూ కొత్త భాష్యం ఇస్తున్నారు మేకర్స్.