Begin typing your search above and press return to search.

వందల కోట్ల నష్టాల్లో మల్టీప్లెక్స్‌ లు

By:  Tupaki Desk   |   5 Nov 2020 11:15 AM IST
వందల కోట్ల నష్టాల్లో మల్టీప్లెక్స్‌ లు
X
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా మార్చి నెల నుండి సినిమా పరిశ్రమ పూర్తిగా స్థంభించింది. సినిమాల షూటింగ్స్‌ కు అనుమతలు వచ్చినా కూడా థియేటర్ల ఓపెన్‌ కు మాత్రం 8 నెలల సమయం పట్టింది. ఇంకా కూడా మెజార్టీ థియేటర్లు మరియు మల్టీప్లెక్స్‌ లు ఇంకా లాక్‌ లోనే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు థియేటర్ల అన్‌ లాక్‌ కు ఓకే చెప్పగా మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ఓపెన్‌ కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. మరికొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నెలలో థియేటర్ల ఓపెన్‌ కు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఒక వేళ థియేటర్లు తెరిచినా కూడా నష్టాలతోనే నడిపించాల్సిన పరిస్థితి. అందుకే థియేటర్లను ఓపెన్‌ చేయాలనే ఉద్దేశ్యంలో యాజమాన్యాలు లేవు.

ఇప్పటికే వచ్చిన నష్టంకు తోడు ఇప్పుడు అదనపు నష్టం అవసరమా అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ పునః ప్రారంభం విషయంలో మీన మేషాలు లెక్కిస్తున్నాయి. థియేటర్లు ఓపెన్‌ చేయలేకున్నా మల్టీప్లెక్స్‌ లను ఓపెన్‌ చేసేందుకు యాజమాన్యాలు రెడీ అవుతున్నాయి. దేశంలోని అతి పెద్ద థియేటర్‌ చైన్‌ ఉన్న కంపెనీలు వేల కోట్ల నష్టాలను చవి చూస్తున్నాయి. గత ఎనిమిది నెలలుగా పూర్తిగా మూత బడి ఉండటంతో వేలాది మంది ఉద్యోగులను పూర్తిగా తీసేయడం జరిగింది. కొందరు శాస్వత ఉద్యోగులను మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగిస్తూ వారికి లక్షల జీతాలు ఇవ్వాల్సి వచ్చింది.

పీవీఆర్‌ సంస్థ గత మూడు నెలల కాలంకు గాను ఆదాయం లేకపోగా దాదాపుగా రూ.185 కోట్ల నష్టాలను చవిచూసింది. థియేటర్ల మెయింటెన్స్‌ మరియు సిబ్బంది జీతాలను ఇవ్వడంకు చాలా మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి. మొత్తానికి ఈ ఏడాదికి గాను దాదాపు అన్ని మల్టీప్లెక్స్‌ లు కూడా వందల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. గత ఏడాది వరకు ప్రతి ఏడాది వందల కోట్ల లాభాలను గడించిన మల్టీప్లెక్స్‌ లు ఈసారికి మాత్రం వందల కోట్ల నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. 2021లో అయినా ఈ పరిస్థితి మారుతుందేమో అనే ఆశతో అంతా ఎదురు చూస్తున్నారు.