Begin typing your search above and press return to search.

మల్టీప్లెక్సుల్లో 'బాహుబలి' దందా!

By:  Tupaki Desk   |   8 July 2015 9:40 AM GMT
మల్టీప్లెక్సుల్లో బాహుబలి దందా!
X
సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల దగ్గర బ్లాకుల్లో టికెట్లు అమ్మడం ఎప్పట్నుంచో చూస్తున్న వ్యవహారమే. పెద్ద సినిమాలు విడుదలైన తొలి రోజు సాధ్యమైనంతగా ప్రేక్షకుల నుంచి దోచుకోవడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. క్రేజ్‌ కొంచెం ఎక్కువుంటే ఫస్ట్‌ వీకెండ్‌ అంతా ఇలాగే జరుగుతుంది. జనాలకు అమ్మాల్సిన టికెట్లను బ్లాక్‌ చేసి.. థియేటర్‌ యాజమాన్యమే బ్లాక్‌లో టికెట్లు అమ్ముతుంటుంది. ఐతే సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల దగ్గర టికెట్ల ధరలు మామూలుగానే తక్కువుంటాయి కాబట్టి ఓకే అనుకోవచ్చు. కానీ మల్టీప్లెక్స్‌ థియేటర్ల యాజమాన్యాలు కూడా కుమ్మక్కై టికెట్లు బ్లాక్‌ చేస్తే.. భారీ ధరలు పెట్టి బ్లాకులో అమ్మేసుకుంటే... 'బాహుబలి' విషయంలో అదే జరుగుతోంది.

హైదరాబాద్‌లోని చాలా మల్టీప్లెక్సుల్లో ఈ దగా జరుగుతోంది. ఆన్‌లైన్లో టికెట్లు కొందామంటే అన్నీ ఫుల్‌. మల్టీప్లెక్స్‌ల దగ్గరికెళ్తే ఆన్‌లైన్లో చూడమంటున్నారు. ఐతే మనం మిస్‌ అయ్యాయేమో.. టికెట్లు ఆన్‌లైన్లో పెట్టగానే జనాలు కొనేశారేమో అనుకుంటే పొరబాటే. చాలా మల్టీప్లెక్స్‌ల్లో కొన్ని టికెట్లు మాత్రమే ఆన్‌లైన్లో అమ్మకానికి పెట్టారు. మిగతావన్నీ బ్లాక్‌ చేసి.. బ్లాక్‌లో అమ్మేస్తున్నారు. ఈ వ్యవహారం మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలకు తెలిసి జరుగుతోందా.. లేక మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ ఈ దగాకు పాల్పడుతోందా అన్నది తెలియడం లేదు. ఫస్ట్‌ వీకెండ్‌ వరకు టికెట్లను రూ.500కు కూడా అమ్మేసుకుంటున్నారు. ఇక సింగిల్‌ స్క్రీన్‌ల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఎక్కడికెళ్లినా 'నో టికెట్స్‌' అన్నదే సమాధానం. బ్లాకులో భారీగా దోచుకోవడానికి ఈ జనాలకు 'బాహుబలి' భలేగా ఉపయోగపడుతోంది. మల్టీప్లెక్సుల్లో కూడా ఈ రేంజిలో దోపిడీ జరుగుతోంటే పోలీసులు ఏం చేస్తున్నారన్నది ప్రశ్నార్థకం. పైరసీ చేయొద్దని.. పెద్ద తెరమీదే సినిమా చూడాలని చెప్పే బాహుబలి టీమ్‌.. ఈ బ్లాక్‌టికెట్ల వ్యవహారాన్ని పట్టించుకోకుంటే.. పైరసీ గురించి ప్రశ్నించే హక్కు వారికి లేనట్లే.