Begin typing your search above and press return to search.

మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ అసోసియేష‌న్ ప్ర‌ధానికి లేఖ.. దేనికి?

By:  Tupaki Desk   |   31 Aug 2020 2:20 PM IST
మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ అసోసియేష‌న్ ప్ర‌ధానికి లేఖ.. దేనికి?
X
అవును ఇది 2020 బిగ్ జోక్... సపోర్ట్ మూవీ థియేటర్స్ ట్యాగ్ అస‌లు దేనికి? కోవిడ్ 19 విజృంభిస్తుంటే ఇప్పుడు ఈ ఉద్య‌మం చేసి ఎవ‌రిని ఉద్ధ‌రిస్తారు? ఇవ‌న్నీ సినీప్రేమికుల డౌట్స్..

ఏదో కంటితుడుపు చ‌ర్య‌గా థియేట‌ర్లు తెరుచుకోండి అని ప్ర‌భుత్వాలు ప్ర‌క‌టించేసినా థియేట‌ర్లకు వ‌చ్చే నాధుడేడీ? తుమ్మినా ద‌గ్గినా భ‌య‌ప‌డే ఈ స‌న్నివేశంలో రోజుకు 10వేలు పైగా కేసులు ఒక్కో తెలుగు రాష్ట్రంలో న‌మోద‌వుతుంటే ఇప్పుడు థియేట‌ర్ వినోదం కావాల్సొచ్చిందా?

నాలుగైదు నెల‌లుగా థియేట‌ర్లు మూత వేశారు. అన్ లాక్ 4.0లో తెరిచేస్తారు! అంటూ ప్ర‌చార‌మైపోవ‌డంతోనే ఈ నిరాశ అనుకోవ‌చ్చు. ఈసారికి దేశంలోని సినిమా హాళ్ళు పాఠశాలలు మినహా దాదాపు అన్నీ తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. థియేట‌ర్లు.. స్కూళ్లు మాత్రం సెప్టెంబర్ 30 వరకు మూసివేసి ఉంటాయి. వీటిని తెరిచే స్థితి లేదు.

అయితే ఇది చాలా మంది సినీ ప్రముఖులకు రుచించ‌లేద‌ట‌. దీంతో `సపోర్ట్ మూవీ థియేటర్స్` అంటూ ట్యాగ్ ‌ను సోష‌ల్ మీడియాల్లో ట్రెండ్ చేయడం ప్రారంభించారు. టాలీవుడ్ లో చాలా మంది దీని గురించి రీట్వీట్ చేయడం ప్రారంభించారు. అదంతా స‌రే కానీ.. తాజాగా విషయం ఏమిటంటే.. భారతదేశం మల్టీప్లెక్స్ అసోసియేషన్ వారి వ్యాపారం తీవ్రంగా ప్రభావితం అవుతున్నందున థియేటర్లను వెంటనే తెరవడానికి అనుమతించాలని మోడీ ప్రభుత్వానికి బలమైన అభ్యర్థన లేఖ రాసింది. అయితే ఈ లేఖ‌కు మోదీ స్పందిస్తారా? దేశంలో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో కాల‌మే చెప్పాల్సి ఉంటుంది. వ్యాక్సినో టీకానో రాకుండా ప్ర‌ధాని అయితే మాత్రం ఏం చేస్తారు?