Begin typing your search above and press return to search.

#మ‌ల్టీప్లెక్స్ రెడీ.. AMB సినిమాస్ లా AVD సినిమాస్..!

By:  Tupaki Desk   |   19 March 2021 8:37 AM GMT
#మ‌ల్టీప్లెక్స్ రెడీ.. AMB సినిమాస్ లా AVD సినిమాస్..!
X
టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌ కెరీర్ ఆరంభం నుంచి ఎంట‌ర్ ప్రెన్యూర్ క్వాలిటీస్ తో హాట్ టాపిక్ అవుతున్నారు. ఓవైపు సినిమాల‌తో బిజీగా ఉన్నా మ‌రోవైపు రౌడీ బ్రాండ్ పేరుతో వ‌స్త్ర‌శ్రేణి వ్యాపారం ప్రారంభించారు. అది పెద్ద స‌క్సెసైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు థియేట‌ర్ వ్యాపారంలోనూ త‌న‌దైన ముద్ర వేసేందుకు ఇత‌ర స్టార్ హీరోల‌ను అనుస‌రిస్తున్నారు. రౌడీ విజయ్ దేవరకొండ థియేట‌ర్ బిజినెస్ టాలీవుడ్ స‌ర్కిల్స్ లో లేటెస్ట్ గా హాట్ టాపిక్.

టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ఏషియన్ సినిమాస్ ‌తో చేతులు క‌లిపిన దేవ‌ర‌కొండ‌ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. మహేష్ బాబు -ఏషియ‌న్ సినిమాస్ సంయుక్తంగా ప్రారంభించిన AMB సినిమాస్ పెద్ద స‌క్సెస‌య్యాక‌ అల్లు అర్జున్ తో క‌లిసి ఏషియన్ సినిమాస్ మ‌ల్టీప్లెక్సుల్ని నిర్మిస్తోంది. అమీర్‌పేట సత్యం థియేటర్ ను సొంతం చేసుకుని అక్క‌డ‌.. పాత బిల్డింగ్ స్థానంలో కొత్త మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిన‌దే.

ఇప్పుడు విజయ్ దేవరకొండతో క‌లిసి ఏషియ‌న్ సినిమాస్ మూడు తెరల మల్టీప్లెక్స్ ను రౌడీ గారి స్వస్థలమైన మహబూబ్ ‌నగర్ లో నిర్మించింది. ఇదివ‌ర‌కూ తిరుమ‌ల థియేట‌ర్ ఈ ప్రాంగ‌ణంలో ఉండేది. అక్క‌డ‌ నిర్మాణం చాలా కాలం క్రిత‌మే ప్రారంభమైంది. ఈ కొత్త‌ మల్టీప్లెక్స్‌కు AVD (ఏషియ‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌) సినిమాస్ అని నామ‌క‌ర‌ణం చేశారు. ఈ ఏడాది వేసవిలో వ‌కీల్ సాబ్ సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌తో ఏవీడీ సినిమాస్ ఘ‌న‌మైన‌ లాంచింగ్ కి రెడీ అవుతోంది. FDFS ప‌రంగా భారీ హైప్ ఉంద‌ని ఇప్ప‌టికే ప్ర‌చారం సాగుతోంది.