Begin typing your search above and press return to search.

థియేటర్స్ తెరవండి.. కేంద్రానికి లేఖ

By:  Tupaki Desk   |   3 July 2020 2:30 PM GMT
థియేటర్స్ తెరవండి.. కేంద్రానికి లేఖ
X
కరోనా లాక్ డౌన్ తో అన్నింటి కంటే ఎక్కువగా ఎఫెక్ట్ పడింది సినిమా పరిశ్రమపైనే. ఇప్పటికీ అన్నీ అన్ లాక్ అయినా ఓపెన్ కానిదీ సినిమా పరిశ్రమనే. దీంతో సినీ పరిశ్రమను నమ్ముకున్న చాలా మంది ఉపాధి కోల్పోయారు. థియేటర్స్ అయితే ఇప్పట్లో తెరిచే అవకాశం లేకపోవడంతో థియేటర్స్ ను నమ్ముకున్న వారికి మూడు నెలలుగా అవి మూతపడి ఉండడంతో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.

అన్ లాక్ లో కేంద్రం అన్నింటికి సడలింపులు ఇస్తోంది. సినిమాలు, సీరియళ్ల షూటింగ్ లకు సైతం అనుమతులు వచ్చాయి. కానీ థియేటర్లు ఓపెన్ చేయడానికి మాత్రం కేంద్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు.

ఈ నేపథ్యంలోనే మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తాజాగా బహిరంగ లేఖ రాసింది. కేంద్రం అన్ లాక్2.0లో కూడా థియేటర్స్ రీఓపెన్ చేయలేదని.. సామాజిక దూరం , క్రౌడ్ కంట్రోల్ చేస్తామని చెప్పినా అనుమతులు ఇవ్వలేదని లేఖలో పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా థియేటర్స్ ను నమ్ముకొని దాదాపు 2 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని.. పరోక్షంగా వేలల్లో ఉపాధి పొందుతున్నారని లేఖలో పేర్కొన్నారు. థియేటర్స్ మూతతో నష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో పకడ్బందీగా ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పిస్తామని తెలిపారు.

ఇప్పటికే ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్, ఆస్ట్రియా , హాంకాంగ్, ఇటీవల బెల్జియం, మలేషియా వంటి దేశాల్లో థియేటర్స్ ఓపెన్ చేశారని..అక్కడ వాటిని అనుమతిచ్చినట్టే దేశంలోనూ ఇవ్వాలని కోరుతున్నామని మల్టీపెక్స్ యజమానులు కోరారు.