Begin typing your search above and press return to search.

జబర్దస్త్‌ షో కు మళ్లీ రానివ్వం అన్నారు : అవినాష్‌

By:  Tupaki Desk   |   4 Nov 2020 10:00 AM IST
జబర్దస్త్‌ షో కు మళ్లీ రానివ్వం అన్నారు : అవినాష్‌
X
జబర్దస్త్‌ కమెడియన్స్‌ దాదాపు పేరున్న వారు అంతా కూడా మల్లెమాల వారితో అగ్రిమెంట్‌ లో ఉంటారు. ఆ అగ్రిమెంట్‌ ను బ్రేక్‌ చేసి మరెక్కడైనా షోకు వెళ్లినా లేదంటే ఇతర ఛానెల్‌ లో షో లు చేసినా కూడా వారు 10 లక్షల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ అగ్రిమెంట్ ను బ్రేక్‌ చేయాలంటే మొదటే రూ.10 లక్షలు చెల్లించి బయటకు వెళ్లి పోవాల్సి ఉంటుందని ఒక టాక్‌ ఉంది. అది నిజమే అంటూ అవినాష్‌ విషయంలో మరోసారి ప్రచారం జరిగింది. బిగ్‌ బాస్‌ లో పార్టిసిపేట్‌ చేసేందుకు గాను మల్లెమాల వారికి ఏకంగా 10 లక్షల రూపాయలను అవినాష్‌ చెల్లించి వచ్చాడు అనేది చాలా మంది చెప్పే మాట.

బిగ్‌ బాస్‌ నుండి బయటకు వెళ్లిన తర్వాత మళ్లీ అవినాష్‌ జబర్దస్త్ లో కనిపిస్తాడా అంటే అనుమానమే అని ఇన్ని రోజులు అంతా అనుకుంటున్నారు. నిన్నటి ఎపిసోడ్‌ లో అవినాష్‌ తాను ఇక ముందు ఆ షో(జబర్దస్త్‌)లో కనిపించే అవకాశం లేదన్నాడు. వారు నాకు క్లారిటీగా మళ్లీ జబర్దస్త్‌ షో కు రానివ్వం అంటూ చెప్పారు. అయినా కూడా నేను ఇక్కడకు వచ్చాను. ఇక్కడ ఇతర ఇంటి సభ్యుల వల్ల పడుతున్న అవమానాలు చాలా బాధ పెడుతున్నాయి అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. అవినాష్‌ కన్నీరు పెట్టుకోవడం చాలా చాలా అరుదుగా బిగ్‌ బాస్‌ లో చూశాం.

అవినాష్‌ కన్నీరు పెట్టుకోవడంతో అతడి స్నేహితులు అయిన అరియానా ఇతరులు అతడిని ఓదార్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి నిన్నటి ఎలిమినేషన్‌ నామినేషన్‌ పక్రియ చాలా మందిని చాలా మందిక దూరం చేసింది. ఎవరు ఎవరితో ఉన్నారు అనే విషయంలో క్లారిటీ వచ్చేసింది.