Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్‌ : ఫన్‌.. సీరియస్ మిక్సింగ్ గా 'ముఖచిత్రం'

By:  Tupaki Desk   |   10 Feb 2022 12:53 PM GMT
ట్రైలర్ టాక్‌ : ఫన్‌.. సీరియస్ మిక్సింగ్ గా ముఖచిత్రం
X
వికాస్ వశిష్ట.. ప్రియా వడ్లమూడి.. చైతన్య రావ్‌.. అయేషా ఖాన్‌.. సునీల్ ఇంకా పలువురు నటించిన 'ముఖచిత్రం' విడుదలకు సిద్దం అయ్యింది. చిన్న చిత్రంగా రూపొందిన ఈ సినిమా కంటెంట్‌ పై నమ్మకంతో మెగా కాంపౌండ్‌ కు చెందిన నిర్మాత ఎస్‌కేఎన్‌ ఈ సినిమాను సమర్పించేందుకు సిద్దం అయ్యాడు. ఆయన తనకున్న ఇమేజ్ తో భారీగా పబ్లిసిటీ చేసి విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి ట్రైలర్‌ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ సినిమాపై ఆసక్తి పెంచే విధంగా ఉంది. ముఖ్యంగా ట్రైలర్‌ చివర్లో వచ్చిన సీన్స్ సినిమా పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి అనడంలో సందేహం లేదు.

ట్రైలర్‌ ఫన్‌ టాక్‌ తో మొదలు అయ్యి మెల్ల మెల్లగా సీరియస్ నోడ్‌ లకు వెళ్తుంది. వికాస్ వశిష్ట మరియు చైతన్య రావ్ ల కాంబోలో సన్నివేశాలు ఎంటర్‌టైనింగ్ గా ఉంటాయి. పెళ్లి చూపుల సన్నివేశం మొదలుకుని పెళ్లి ఫస్ట్‌ నైట్‌ ఇలా అన్ని సన్నివేశాలు కూడా ట్రైలర్‌ లో చూపించి.. ఆ తర్వాత హత్యకు సంబంధించిన షాట్స్ చూపించడంతో సినిమాపై ఇంట్రెస్ట్‌ పెంచారు. ఇక హీరో వికాస్‌ వశిష్ట మరియు హీరోయిన్ ల మద్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఆకట్టుకునే విధంగా దర్శకుడు గంగాధర్ మలిచినట్లుగా అనిపిస్తుంది. తప్పకుండా ఈ సినిమాలోని కామెడీ మరియు రొమాంటిక్ సన్నివేశాలు యూత్ ఆడియన్స్ కు కనెక్ట్‌ అయ్యేలా ఉన్నాయి. యూత్‌ కు కనెక్ట్‌ అయ్యేలా ఉన్న సన్నివేశాలు ఖచ్చితంగా ఈ సినిమా కు మంచి ఆధరణ దక్కేలా చేయడం ఖాయం అనిపిస్తుంది.

ఈ సినిమా ను భారీ ఎత్తున ప్రమోట్‌ చేస్తున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగుతోంది. అతి త్వరలోనే ఈ సినిమా ను థియేటర్లలో విడుదల చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. ఓటీటీ లో విడుదల చేయకుండా థియేటర్‌ రిలీజ్ కు సిద్దం అయ్యారు అంటే ఖచ్చితంగా ఈ సినిమా పై మేకర్స్ లో మంచి నమ్మకం ఉంది. థియేటర్ రిలీజ్ అంటే ఖచ్చితంగా రిస్క్ విషయం. కంటెంట్ పై నమ్మకంతో సినిమా ను థియేటర్‌ రిలీజ్ కు సిద్దం చేయడం జరుగుతుందట. కనుక సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

ఈ సినిమా కు కీరవాణి తనయుడు కాళ భైరవ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలువబోతుంది. ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ చాలా ఇంట్రెస్ట్‌ ను కలిగించింది. కనుక సినిమాలో కూడా ఆయన మ్యూజిక్‌ మెప్పిస్తుందేమో చూడాలి. ఈ సినిమాకు కథ.. స్క్రీన్‌ ప్లే మరియు డైలాగ్స్ ను సందీప్ రాజ్ అందించాడు. గంగాధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ ముఖచిత్రం ప్రేక్షకులకు సరికొత్త ఫీలింగ్ ను కలిగిస్తుందేమో చూడాలి.