Begin typing your search above and press return to search.

NBK 106 .. ఎట్ట‌కేల‌కు ముహూర్తం ఫిక్స్

By:  Tupaki Desk   |   27 Feb 2020 5:00 AM GMT
NBK 106 .. ఎట్ట‌కేల‌కు ముహూర్తం ఫిక్స్
X
NBK 106 సెట్స్ కెళ్లేదెపుడు? అన్ని అవాంత‌రాలు తొల‌గిన‌ట్లేనా? బాల‌య్య స్క్రిప్ట్ ను ఫైన‌ల్ చేసి ప‌ట్టాలెక్కించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ అయ్యారా? అంటే ... వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. బాల‌య్య 106వ సినిమా విష‌యంలో కొన‌సాగుతున్న స‌స్పెన్స్ ఇప్ప‌టికీ అలానే కొన‌సాగింది. గ‌త ప‌రాజ‌యాల నేప‌థ్యంలో తాజా చిత్రంతో ష్యూర్ షాట్ గా హిట్ కొట్టాల‌ని బాల‌య్య అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంద‌ట‌. అందుకే బోయ‌పాటి స‌బ్జెక్ట్ ని అంత ఈజీగా ఓకే చేయ‌లేదు. ఒక‌టికి ప‌దిసార్లు క్రాస్ చెక్ చేసుకుని..అవ‌స‌రం మేర మార్పులు..చేర్పులు సూచించి న‌చ్చిన విధంగా మార్పులు చేయించారు.

ఇప్ప‌టికే బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేస్తున్న సంగ‌తి లీకైంది. ఆయ‌న‌ అఘోర పాత్ర‌లో న‌టించ‌నున్నార‌ని.. కాశీ బ్యాక్ డ్రాప్ లో సీన్స్ తెర‌కెక్కించ‌నున్నార‌ని రివీలైంది. ఈ లీకుల‌ను బ‌ట్టే ప‌నుల‌న్నీ ఓ కొలిక్కి వ‌చ్చాయ‌ని అర్థ‌మైంది. వాస్త‌వానికి ఈ నెల‌లోనే సినిమా సెట్స్ కు వెళ్లాల్సి ఉంది. కానీ స్క్రిప్ట్ విష‌యంలోనే గందర‌గోళం నెల‌కొన‌డంతో వాయిదా మీద వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.

ఎట్ట‌కేల‌కు ఫైన‌ల్ గా బౌండ్ స్క్రిప్టును లాక్ చేసి మార్చి 2 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించాల‌ని ముహూర్తం ఫిక్స్ చేసారుట‌. తొలి షెడ్యూల్ ని హైద‌రాబాద్ లోనే పూర్తిచేస్తారుట‌. అనంతంరం ఔట్ డోర్ షెడ్యూల్స్ ఉంటాయ‌ని యూనిట్ వ‌ర్గాల నుంచి తెలిసింది. అలాగే ఒక‌హీరోయిన్ అంజ‌లిని ఎంపిక చేసారు. మ‌రో నాయిక‌గా సోనాలి చౌహ‌న్ తీసుకున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది . మ‌రి ఈ విష‌యాలు అధికారికంగా వెల్ల‌డిస్తే గానీ క్లారిటీ రాదు. అయితే తాజా ప్ర‌చారం పై బాల‌య్య అభిమానులు ఖుషీ అవుతున్నారు.