Begin typing your search above and press return to search.

బయోపిక్ వద్దనుకున్న అక్కినేనివారు!

By:  Tupaki Desk   |   1 March 2019 4:59 PM IST
బయోపిక్ వద్దనుకున్న అక్కినేనివారు!
X
టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ ఇప్పుడు ఎంత జోరుగా ఉందో అందరికీ తెలుసు. 'మహానటి' సినిమాతో అదో ఉద్యమంలా ఊపందుకుంది. కానీ రీసెంట్ గా విడుదలైన బయోపిక్ లను జనాలు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు కొందరు ఫిలిం మేకర్స్ ఆలోచనలో పడుతున్నారట. అలా ఆలోచనలో పడినవారిలో సీనియర్ స్టార్ హీరో నాగార్జున కూడా ఉన్నారట.

ఏఎన్నార్ బయోపిక్ గురించి నాగార్జునను గతంలో అడిగినప్పుడు 'నాన్నగారి జీవితంలో ఒక సినిమాకు కావలినంత డ్రామా లేదు.. బయోపిక్ కు అవసరమైన కంటెంట్ లేదు' అన్నారు. కానీ ఆయనకు ఏఎన్నార్ బయోపిక్ తెరకెక్కించాలనే ఆలోచన ఉందట. అయితే రీసెంట్ గా బయోపిక్ సినిమాలను ప్రేక్షకులు తిరస్కరించడంతో నాగ్ తన ఆలోచనను విరమించుకున్నారట. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎన్టీఆర్ బయోపిక్ కూడా ఒక కారణమట. రీసెంట్ గా నాగార్జున స్పెషల్ స్క్రీనింగ్ వేయించుకొని 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాను తిలకించారట. సినిమా బాగున్నప్పటికీ ప్రేక్షకులు ఎందుకు తిరస్కరించారో అర్థం కావడంలేదని అభిప్రాయపడ్డారట. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏఎన్నార్ బయోపిక్ తెరకెక్కించడం సరైన నిర్ణయం కాదని డిసైడ్ అయ్యారట.

ఇక నాగార్జున నెక్స్ట్ సినిమా విషయానికి వస్తే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మధుడు 2' సినిమాలో నటించనున్నారు. నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్.. పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు.