Begin typing your search above and press return to search.

ఈ బోల్డ్ సినిమా విడుదల గురించి త్వరలో వెల్లడిస్తాం: ప్రముఖ దర్శకనిర్మాత

By:  Tupaki Desk   |   24 Jun 2020 12:30 AM GMT
ఈ బోల్డ్ సినిమా విడుదల గురించి త్వరలో వెల్లడిస్తాం: ప్రముఖ దర్శకనిర్మాత
X
ఒక్కడు.. వర్షం.. మనసంతా నువ్వే.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఎంఎస్ రాజు.. దాదాపు 8యేళ్ళ తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టుకొని ఓ సినిమా రూపొందిస్తున్నాడు ఆ సినిమానే "డర్టీ హరి". ఇదివరకే దర్శకుడిగా వాన.. తూనీగ తూనీగ సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. తను డైరెక్ట్ చేసిన సినిమాలకు ఫీల్‌ గుడ్‌ సినిమాలని పేరొచ్చిన కమర్షియల్‌గా మాత్రం సక్సెస్ కాలేదు. దీంతో కొన్నేళ్లుగా దర్శకనిర్మాణ రంగాలకు దూరంగా ఉన్న ఎంఎస్‌ రాజు భారీ గ్యాప్ తీసుకొని ట్రెండ్ ని ఫాలో అవుతున్నాడు. గతంలో నిర్మాతగా.. దర్శకుడిగా అందమైన ప్రేమకథలను తెరకెక్కించిన ఈయన ఇప్పుడు ట్రెండ్‌ మార్చి.. ఈ ప్రస్తుతం జనరేషన్ పై ఆలోచించి ఓ బోల్డ్‌.. కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఇదివరకే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. 'డర్టీ హరి' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రవణ్‌ రెడ్డి టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నాడు బాత్‌ టబ్‌లో షర్ట్ లేకుండా ఉన్న హీరోకు ఓ అమ్మాయి తన కాళ్లతో సిగరెట్ అందిస్తున్నట్టుగా ఉన్న స్టిల్‌తో ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను డిజైన్‌ చేశారు. ఇక ఆ పోస్టర్‌తోనే సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చేశారు రాజు. అయితే ప్రస్తుతం కరోనా టైం నడుస్తున్నందున థియేటర్లు తెరుచుకొనే పరిస్థితులు కనిపించడం లేదు. ఇంకా ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా తెలియని పరిస్థితి. అయితే పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు నిర్మాతలు ఓటిటి ప్లాట్ ఫామ్ ల వైపు దృష్టి పెడుతున్నారు.

అయితే ఎంస్ రాజు రూపొందించిన ఈ డర్టీ హరి సినిమా కూడా ఓటిటిలో రానుందని వార్తలొస్తున్నాయి. అయితే ఎంఎస్ రాజు ఇటీవలే ఈ సినిమా ఓటిటిలో విడుదల అవుతుందా లేదా అనేది త్వరలో ప్రకటిస్తామన్నారు. కానీ కొసమెరుపుగా ఈ సినిమా థియేటర్లో చూస్తేనే బాగుంటుందని అన్నారు. రుహాని శర్మ, సిమ్రత్ కౌర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చూడాలి మరి ఎంఎస్ రాజు.. నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకుంటారో..! ఈ సినిమాను ఎస్పీజే క్రియేషన్స్‌ బ్యానర్‌పై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్‌లు నిర్మిస్తున్నారు.