Begin typing your search above and press return to search.

ధోని దుమ్ము దులిపేస్తున్నాడు

By:  Tupaki Desk   |   2 Oct 2016 11:25 AM GMT
ధోని దుమ్ము దులిపేస్తున్నాడు
X
‘ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ ట్రైలర్ యూట్యూబ్ రికార్డుల్ని తిరగరాసినపుడే ఈ సినిమా మీద జనాల్లో ఆసక్తి.. అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమైంది. ఇప్పుడు ఆ అంచనాలకు తగ్గట్లే బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది నీరజ్ పాండే సినిమా. తొలి రోజు ఇండియాలో రూ.21.3 కోట్లు కొల్లగొట్టిన ‘ఎం.ఎస్.ధోని’ రెండో రోజు కూడా తగ్గలేదు. రూ.20.6 కోట్లతో తొలి రోజుకు దీటుగా వసూళ్లు సాధించింది.

మామూలుగా తొలి రోజు తర్వాత వసూళ్లు డ్రాప్ అవుతాయి. కానీ ధోని సినిమా విషయంలో అలా జరగలేదు. ఇక ఆదివారం తొలి రెండు రోజుల కంటే భారీగా వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు. ఓ చిన్న హీరో నటించిన సినిమాకు ఈ స్థాయి వసూళ్లంటే ఆశ్చర్యమే. ఇక్కడే ధోని ఫాలోయింగ్ ఏంటో అందరికీ బాగా అర్థమవుతోంది. బయోపిక్స్ లో ‘ఎం.ఎస్.ధోని’ సినిమా ప్రత్యేక అధ్యాయంలా నిలిచిపోవడం ఖాయం. తొలి వీకెండ్లో ఈ సినిమా ఇండియాలోనే రూ.65 కోట్లకు పైగా వసూలు చేస్తుందని అంచనా.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో విడుదలవడం విశేషం. కాబట్టి ఇండియాలో ఎంత కలెక్షన్ వచ్చిందో.. మిగతా దేశాల్లోనూ అదే స్థాయిలో వసూళ్లు ఉంటాయని భావించవచ్చు. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు.. తమిళం లాంటి రీజనల్ లాంగ్వేజెస్ లోనూ ధోని సినిమాకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా తమిళంలో ఈ సినిమా డైరెక్ట్ తమిళ సినిమాల స్థాయిలో వసూళ్లు సాధించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/