Begin typing your search above and press return to search.

ధోనీ అన్ టోల్డ్ స్టోరీలో విషాద గాధ

By:  Tupaki Desk   |   26 Sep 2016 7:30 PM GMT
ధోనీ అన్ టోల్డ్ స్టోరీలో విషాద గాధ
X
ఇండియన్ క్రికెట్ కి మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఇండియాకి 2 వరల్డ్ కప్పులు అందించిన ధోనిపై బయోపిక్ అనగానే.. అందరిలోనూ ఆసక్తి కలిగింది. అయితే.. ధోనీ ప్రపంచ కప్ కొట్టిన చరిత్ర గురించి చెప్పడంతో పాటే.. ఈ ప్లేయర్ చిన్నప్పటి నుంచి జరిగిన సంగతులను చూపించబోతున్నారని ట్రైలర్ లోనే అర్ధమవుతోంది. కానీ.. అన్ టోల్డ్ స్టోరీ అనే టైటిల్ ని పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచిన టీం.. ప్రపంచానికి తెలియని ఒక్కో సంగతిని రివీల్ చేస్తోంది.

సాక్షి సింగ్ రావత్ తో ధోనీ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఎదగక ముందే.. ధోనీ లైఫ్ లో ఓ విషాదం ఉంది. గతంలో ప్రియాంక ఝా అనే అమ్మాయిని ధోనీ ప్రేమించాడనే విషయం ప్రపంచానికి తెలియదు. 2002 ప్రాంతంలో.. ఇండియన్ క్రికెట్ లోకి అడుగు పెట్టేందుకు ధోనీ ఎంతగానే ప్రయత్నిస్తున్న రోజులవి. ఆ సమయంలోనే ప్రియాంక ఝా తోనే తన జీవితం అని దాదాపు ఫిక్స్ అయిపోయాడు కూడా. కెన్యా.. జింబాబ్వే టూర్ లకు ఇండియా ఏ తరఫున ధోనీని ఎంపిక చేశారు. వాటిలో సక్సెస్ కావడంతో 2004లో బంగ్లాదేశ్ తో ఆడేందుకు కూడా ఎంపికయ్యాడు. కానీ ఆ సమయంలో ప్రియాంక ఝా అనుకోకుండా మరణించింది.

ఈ షాక్ నుంచి కోలుకునేందుకు ధోనీకి ఏడాదికి పైగా సమయం పట్టింది. కానీ.. బంగ్లాదేశ్ టూర్ లో మాత్రం తన ట్యాలెంట్ చూపించాడు. ఆ జ్ఞాపకం లాంటి లవ్ స్టోరీని సినిమాలో పెట్టేందుకు ధోనీ ఒప్పుకోవడం విశేషం. రీసెంట్ గా రిలీజ్ చేసిన పాటలో ఈ విషయం వెల్లడైంది. ధోనీ గురించి జనాలకు తెలీని ఇలాంటి విషయాలు ఇంకా చాలానే ఉంటాయని చెబుతోంది ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ యూనిట్.